
అడవుల్లో రోడ్ల నిర్మాణంపై ఆర్ & బీ, ఫారెస్ట్ అధికారులతో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కొండా సురేఖల రివ్యూ మీటింగ్.
తెలంగాణలో అటవీ అనుమతులు లేక ఆగిపోయిన రోడ్ల నిర్మాణంపై విస్తృతంగా చర్చిస్తున్న ఇరువురు మంత్రులు.
అటవీ అనుమతులకు ఉన్న అడ్డంకులను అధిగమించేందుకు మరింత వేగంగా కృషి చేయాలని అధికారులకు సూచించిన ఇరువురు మంత్రులు.
అటవీ అనుమతుల వల్ల ఆర్ & బీ పరిధిలో దాదాపు 91 పనులు పెండింగ్ లో ఉన్నట్టు తెలిపిన అధికారులు.
అటవీ అనుమతులు సాధించేందుకు కలిసికట్టుగా పనిచేయాలని ఇరు శాఖల అధికారులకు సూచించిన మంత్రులు.
రహదారుల నిర్మాణం ఆలస్యం అయితే, రాష్ట్ర ప్రగతి కుంటుపడుతుందన్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.
దాదాపు 7 రోడ్డు పనుల ప్రాజెక్టులు అటవీ అనుమతులు లేక 5 సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్నాయని తెలిపిన ఆర్ & బీ అధికారులు.
వేగంగా అటవీ అనుమతులు సాధించేందుకు ప్రత్యేకంగా అధికారులను నియమించాలని అటవీ అధికారులకు సూచించిన మంత్రి కొండా సురేఖ.
రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఛాంబర్ లో కొనసాగుతున్న సమావేశం