*నాలుగు రోజుల పాటు అతి భారీ వర్షాలు: ఐఎండీ..*
* తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లకు మరోసారి భారీ వర్షం ముప్పు ఉన్నట్లు భారత వాతావరణ కేంద్రం తెలిపింది.*
బంగాళాఖాతంలో మరో అల్ప పీడనం ఏర్పడిందని, దాని ప్రభావం తెలుగు రాష్ట్రాలపై తీవ్రంగా ఉండనుందని వెల్లడించింది.
నైరుతి బంగ్లాదేశ్ ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఉత్తర బంగాళాఖాతం, బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్‌కు చేరువగా బంగాళాఖాతంలో అల్ప పీడనం ఏర్పడనున్నట్లు ఐఎండీ వెల్లడించింది..