‘ఇండియన్ టెర్రెయిన్’ 196 వ షోరూంను ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు.

ఇండియన్ టెర్రెయిన్ ఫ్యాషన్స్ సంస్థ తెలంగాణాలో వస్త్రాల ఉత్పత్తి పరిశ్రమను ఏర్పాటు చేయాలని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆ సంస్థ యాజమాన్యాన్ని కోరారు. ఆదిలాబాద్ జిల్లాలో 80 వేల మంది రైతుల నుంచి సేకరించిన సేంద్రియ పత్తితో ఆ సంస్థ ఏటా నాలుగు కోట్ల మీటర్ల నూలు వస్త్రాలను తయారు చేస్తుందని ఆయన వెల్లడించారు. నాణ్యమైన పత్తితోపాటు, నైపుణ్యం ఉన్న యువత అందుబాటులో ఉన్నందున దుస్తుల ఉత్పత్తి పరిశ్రమ ఏర్పాటు చేయడానికి తెలంగాణా అనుకూలంగా ఉంటుందని ఆయన వెల్లడించారు.

బుధవారం నాడు బంజారాహిల్స్ రోడ్ నం.3 లో ఇండియన్ టెర్రెయిన్ 196 వ షోరూంను మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. ఒక్కో షోరూం ద్వారా 12 మంది ఉపాధి పొందడం సంతోషకరమని శ్రీధర్ బాబు తెలిపారు.

వ్యాపారంలోకి అడుగుపెట్టి ఎంతో మందికి ఉపాధి కల్పించిన ఉన్నత విద్యావంతుడు, షోరూం యజమాని అంకన్నగారి ఉత్కర్శ్ ను మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి, క్రికెటర్ అజారుద్దీన్, పిసిసి అధికార ప్రతినిధి శ్రీనివాస్, ఇండియన్ టెర్రెయిన్ ఎండీ చరత్ నరసింహన్, సిఓఓ షెహనాజ్, జోనల్ మేనేజర్ ప్రవీణ్ బింగి పాల్గొన్నారు.

Spread the love