మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి కామెంట్స్ :

కేటీఆర్ ను రాజకీయంగా ఎదుర్కొలేక కుట్ర చేస్తున్నారు.

కేటీఆర్ బావమరిది స్వంతంగా ఫార్మ్ హౌస్ కట్టుకుని గృహ
ప్రవేశం చేశారు.

జన్వాడలో ఏం దొరకలేదు..అక్కడ ఏం దొరక్కపోతే..
గచ్చిబౌలిలో రాజ్ పాకాల
ఇంట్లో సెర్చ్ చేస్తున్నారు.

జన్వాడలో సెర్చ్ చేసిన ఎక్సైజ్ ఆఫీసర్ బాటిల్స్ తప్పా..డ్రగ్స్ ఆనవాళ్లు లేవని స్పష్టం చేశారు.

ఏదో ఒకటి చేయాలని ప్రభుత్వ పెద్దల ఒత్తిడి తో…

కేటీఆర్ పైన కక్ష తీర్చుకునేందుకు
కుటుంబ సభ్యలను
బలి చేసే ప్రయత్నం చేస్తున్నారు.

రాజ్ పాకాల ఇంట్లోకి
లాయర్లను పంపించాలి.

పోలీసులు రాజ్ పాకాల ఇంట్లోకి వెళ్లి ఏదో ఒకటి పెట్టి కేసు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు.

ప్రభుత్వ పెద్దలు మానిటరింగ్ చేస్తున్నట్లు మాకు సమాచారం ఉంది.

ఏదో ఒకటి చేసి కేసు పెట్టండి అని ప్రభుత్వ పెద్ద పోలీసులను ఒత్తిడి చేస్తున్నట్లు మాకు సమాచారం ఉంది.

పోలీసులే ఏదైనా పెట్టి..ఇక్కడే దొరికింది అని చెప్పే కుట్ర జరుగుతోందని మాకు అనుమానం ఉన్నది.

కేటీఆర్ పైన ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోంది.

నలువైపులా కెమెరాలు,మెజిస్ట్రేట్ సమక్షంలో సెర్చ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం..

అక్రమ సోదాలు ఆపాలని డిజిపి ని కోరుతున్నాం.

ప్రజాస్వామ్యంలో ఇది సరైన పద్ధతి కాదు.

Spread the love