కేటిఆర్ వ్యాఖ్యలపై మంత్రి సీతక్క తీవ్ర అగ్రహం
తెలంగాణ ఆడబిడ్డల పండుగ బతుకమ్మ మొదటి రోజే మహిళా మంత్రులను కించ పరిచి కేటీఆర్ తన నైజం చాటుకున్నాడు
ఎంగిలిపూల బతుకమ్మ రోజే కేటీఆర్ గలీజ్ మాటలు వినాల్సి రావటం మన దురదృష్టం
మా నోళ్లను పినాయిల్ తో కడగాలనీ మాట్లాడిన కుసంస్కారి కేటీఆర్
పండగల పూట మహిళ పట్ల చీప్ కామెంట్ చేసే కేటీఆర్ నోటినే యాసిడ్ తో కడగాలి
పండగల పూట మహిళలు, మహిళా మంత్రులను కించపరచడం కేటీఆర్ కు ఫ్యాషన్ అయింది
రాఖీ పండగ రోజు బస్సుల్లో మహిళలు బ్రేక్ డాన్సులు చేసుకోవచ్చు అన్నాడు
బతుకమ్మ మొదటి రోజు చిట్ చాట్ పేరుతో మా గురించి చానా చులకనగా గా మాట్లాడారు
అదే విషయం మీడియా ముఖంగా చెప్పి ఉంటే మహిళలే మీకు బుద్ధి చెప్పేవారు
మహిళా మంత్రులను పదే పదె కించపరుస్తూ తన దొర దురంకారాన్ని కేటీఆర్ చాటుకుంటున్నాడు
చాటుమాటుగా నాలుగు గోడల మధ్య మాట్లాడటం కాదు.. ధైర్యముంటే బహిరంగంగా మాట్లాడు
నేనెప్పుడూ వ్యక్తిగతంగా ఎవరిని దూషించలేదు
దూషణలకు, భూతులకు బ్రాండ్ అంబాసిడరే మీరు
నేను మిమ్మల్ని వ్యక్తిగతంగా దూషించినట్లు ఆధారాలు చూపిస్తావా?
రాజకీయాల్లో మేము ఉండకూడదన్న లక్ష్యం తోనే టిఆర్ఎస్ సోషల్ మీడియా ద్వారా మా పై పదేపదే అభ్యంతరకర కామెంట్స్ చేయిస్తున్నారు
కనీసం సొంత సోషల్ మీడియాను కట్టడి చేయాలన్న సభ్యత కేటీఆర్ కి లేదు
నువ్వు ఇలానే రెచ్చిపోతే రేపు మీ కుటుంబ సభ్యులు తలదించుకోవాల్సి వస్తుంది