మంత్రి కొండ సురేఖ వ్యాఖ్యలపై స్పందించిన నటి సమంత
నా విడాకులు వ్యక్తిగత విషయం, దాని గురించి ఊహాగానాలు చేయడం మానుకోవాలని నేను అభ్యర్థిస్తున్నాను.
స్త్రీగా ఉండటానికి,
బయటకు వచ్చి నిలబడి పోరాడటానికి….
చాలా ధైర్యం, బలం కావాలి.
కొండా సురేఖ గారూ, ఈ ప్రయాణం నన్ను మార్చినందుకు గర్వపడుతున్నాను-
దయచేసి చిన్నచూపు చూడకండి.
ఒక మంత్రిగా మీ మాటలకు వాల్యూ ఉందని మీరు గ్రహించారని ఆశిస్తున్నాను.
వ్యక్తుల వ్యక్తిగత విషయాల పట్ల మాట్లాడేటప్పుడు బాధ్యతగా మరియు గౌరవంగా ఉండాలని నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను.
నా విడాకులు పరస్పర అంగీకారం మరియు సామరస్యపూర్వకంగా జరిగాయి,
ఎటువంటి రాజకీయ కుట్ర ప్రమేయం లేదు.
దయచేసి నా పేరును రాజకీయ పోరాటాలకు దూరంగా ఉంచగలరా? నేను ఎప్పుడూ రాజకీయాలకు అతీతంగా ఉంటాను
అలానే ఉండాలని కోరుకుంటున్నాను…..
సమంత