

గాంధీ భవన్ మంత్రులతో ముఖాముఖి కార్యక్రమానికి సోమవారం మంత్రి తుమ్మల.
ఉదయం 11 గంటల నుంచి ముఖాముఖి కార్యక్రమం ప్రారంభం.
టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గాంధీ భవన్ లో మంత్రులతో ముఖాముఖి కార్యక్రమంలో సోమవారం (07/10/2024). నాడు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొననున్నారు.
షెడ్యూల్ ప్రకారం శుక్రవారం నాడు జరగాల్సిన మంత్రులతో ముఖాముఖి కార్యక్రమం టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తన స్వంత జిల్లా నిజామాబాద్ జిల్లా లో పర్యటించడం తో వాయిదా పడిన విషయం తెలిసిందే.
ముందుగానే ప్రకటించినట్టుగా సోమవారం నాడు ఈ కార్యక్రమాలు కొనసాగుతాయి. కాగా ఇప్పటికే మొదటి రోజు వైద్య, ఆరోగ్య శాఖ శ్రీ దామోదర్ రాజా నర్సింహ గారు, రెండో రోజు నీటి పారుదల శాఖ మంత్రి శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పాల్గొన్నారు.
సోమవారం నాడు వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వర్ రావ్ గారు పాల్గొనే ఈ కార్యక్రమంలో ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా పాల్గొని సమస్యలు పరిష్కరించుకోవాలని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు.