*హస్తినలో చీఫ్ సెక్రటరీ అండ్ టీం!*

మూడో కంటికి తెలియకుండా ఢిల్లీకి వెళ్లిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి..!

ఆమెతో పాటు ఢిల్లీకి వెళ్లిన ఐటీ, పరిశ్రమల శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, అడ్వైజర్ శ్రీనివాస్ రాజు, సాధారణ పరిపాలన శాఖ ముఖ్యకార్యదర్శి రఘునందన్ రావు, పీసీసీఎఫ్ డోబ్రియల్, టీజీఐఐసీ ఎండీ విష్ణువర్ధన్ రెడ్డి,

ఈ నెల 16 వ తేదీన సుప్రీంకోర్టులో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల కేసు విచారణ ఉన్న నేపథ్యంలో ప్రాధాన్యత సంతరించుకున్న ఉన్నతాధికారుల హస్తిన పర్యటన.

కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై దేశ అత్యున్నత న్యాయస్థానంలో ఏం జరుగుతుందో అని అధికారుల్లో ఉత్కంఠ.

అపెక్స్ కోర్టుకు ప్రభుత్వం సమర్పించాల్సిన అఫిడవిట్ పై న్యాయ సలహాల కోసం సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్స్ తో రహస్య సంప్రదింపులు?

Spread the love