హైదరాబాద్, అశోక్ నగర్ చౌరస్తా వద్దకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్.
గ్రూప్ 1 బాధితులకు న్యాయం చేయాలంటూ అభ్యర్థులతో కలిసి రోడ్డుపై బైఠాయించిన కేంద్ర మంత్రి.
బండి సంజయ్ తోపాటు రోడ్డుపైనే బైఠాయించిన నిరుద్యోగులు.
గ్రూప్ 1 అభ్యర్థులకు న్యాయం చేసేంత వరకు కదిలేదని తేల్చి చెప్పిన బండి సంజయ్.
బండి సంజయ్ వస్తున్నారని తెలిసి అశోక్ చౌరస్తా హాస్టళ్ల వద్ద అడుగడుగునా పోలీసుల పహారా.
హాస్టళ్ల నుండి బయటకు రాకుండా నిరుద్యోగులను కట్టడి చేస్తున్న పోలీసులు.
పోలీసుల నిర్బంధాలను అధిగమించి అశోక్ నగర్ చౌరస్తాకు తరలివస్తున్న బాధితులు.
బండి సంజయ్ ను కలిసి తమ గోడు వెళ్లబోసుకుంటున్న గ్రూప్ 1 అభ్యర్థులు.
మహిళ అని కూడా చూడకుండా దారుణంగా కొట్టి 12 గంటలపాటు నిర్బంధించారని వాపోయిన మహిళా అభ్యర్థులు.