జన్వాడ ఫామ్ హౌస్ కేసుపై ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందించారు.
ఎవరైనా పిర్యాదు చేస్తే .. దానిపై స్పందించి.. ఎన్ఫోర్స్ మెంట్ అధికారులు సోదాలు చేయడం పరిపాటి.
చట్టం ఎవరికి చుట్టం కాదు. విశ్వాసనీయ సమాచారం అందడంతో ఎస్వోటీ పోలీసులు, ఎక్సైజ్ అధికారులు ఫామ్‌హౌస్‌లో తనిఖీలు నిర్వహించారు.
రొటీన్ ప్రాసెస్ లో భాగంగా అధికారులు సోదాలు చేశారు.
ఫాం హౌస్ లో వేడుకలకు ఎక్సైజ్ శాఖ నుంచి ఎలాంటి ఈవెంట్ పర్మిమిషన్ తీసుకోలేదు.
ఎలాంటి అనుమతి లేకుండా లిక్కర్ పార్టీ జరిగినట్లు అధికారులు గుర్తించారు.
నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ ( విదేశీ మద్యం) ఎస్వోటీ పోలీస్ లు, ఎక్సైజ్ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఇంపోర్టెడ్ లిక్కర్ కు డ్యూటీ ఫ్రీ బిల్స్ చూపించలేదు.