
ఏపీలో ఎమ్మెల్యేలకు తిరుమల దర్శనాల కోటా పెంపు.
ఇకపై వారంలో ఆరు రోజులు సిఫారసు లేఖలు.
* తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం అయ్యారు.
* తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు.
* తిరుమల దర్శనాలకు సంబంధించి.. ప్రస్తుతం వారంలో నాలుగు రోజులపాటు ఎమ్మెల్యేల సిఫారసు లేఖల్ని అనుమతిస్తున్నారు.
*అయితే ఇకపై వాటిని ఆరు రోజులకు పెంచేందుకు ముఖ్యమంత్రి అంగీకరించారు.
*అలాగే వారికి వారంలో ఆరు రోజులపాటు, రోజుకి ఆరు చొప్పున సుపథం (రూ.300 టికెట్‌లు) ఇచ్చేందుకూ ఓకే చెప్పారు.