
అన్నమయ్య జిల్లా:- రాయచోటి నుంచి
ఎమ్మెల్సీ.. మండలి డిప్యూటి ఛైర్మన్ జఖియా ఖానుం
కృష్ణ తేజ అనే పిఆర్వో ఎవరో కూడా నాకు తెలియదు.
బెంగళూరుకు చెందిన చంద్రశేఖర్ అనే వ్యక్తి కూడా నాకు తెలియదు.
శశికుమార్ ఎవరో కూడా నాకు తెలియదు.
లెటర్లు అడిగిన సన్నిహితులకు ఇస్తూ వచ్చాము.
తిరుమల దేవస్థానానికి సంబంధించిన ఇష్యూ ఈరోజు ఉదయమే నాకు తెలిసింది.
ఇందులో వాస్తవం లేదు.
నాకు పిఆర్వోలు ఎవరూ లేరు ముందు ఉన్న పిఆర్ఓ గతంలో భక్తులకు రెస్పాండ్ కావడం లేదని అతనిని తీసేసాము.
తర్వాత నా పిఏ నే అన్ని చూసుకుంటున్నాడు.
ఈ నాలుగేళ్లలో నేను ఎటువంటి లిమిట్స్ క్రాస్ చేయలేదు.
చట్టపరంగానే వ్యహరిస్తున్నాను.
నా స్నేహితులు కు మాత్రమే లెటర్స్ ఇస్తూ వచ్చాను.
ఇన్నేళ్ళలో ఎప్పుడూ ఇలాంటి సంఘటన జరగలేదు.
దీని వెనక ఏదో రాజకీయ కోణం ఉన్నట్లు అనిపిస్తుంది.
ఒక మైనారిటీ మహిళ ఉన్నత స్థానంలో ఉందని చెప్పి నా పట్ల ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారు.
మా కుటుంబానికి మంచి రాజకీయ అనే పద్యం ఉంది.
కులమతాలకు అతీతంగా మేము సర్వీస్ చేశాము.
నేను ఉన్నత పదవిలో ఉన్నానని ఏ రోజు ప్రోటోకాల్ ను అధిగమించలేదు.
పదవుల ఏమి శాస్వతం కాదు.
ఈ నాలుగేళ్ళలో నాపై ఒక్క చెడ్డ మరక కూడా లేదు.
నన్ను ఇబ్బంది పెట్టిన వారిని కూడా నేనెప్పుడూ ఇబ్బంది పెట్టలేదు.
ప్రస్తుతం చిన్న క్యాడర్లో ఉన్న వ్యక్తులు కూడా చెలరేగిపోతున్నారు.
నేను అబద్దాలు చెప్పను, ఇక్కడ చిన్న పిల్లాడిని అడిగినా గురుంచి చెబుతారు.
ముఖ్యమంత్రులే అవసరాన్ని బట్టి పార్టీలు మారతారు.
పార్టీ మారడం అనేది తప్పుకాదు.
సామాజికాల పరంగా పార్టీలకు అవసరాలు ఉంటాయి.
దానిని బట్టి నడుచుకోవాలి.
ఏపార్టీలో ఉన్నా లాయల్ గా నడుచుకునే కుటుంబం మాది.
ఇలా ఎందుకు జరిగిందో అర్దం కావడం లేదు ఇలా ఎప్పుడూ బిహేవ్ చేయలేదు.