ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు @ సెక్రటేరియట్ మీడియా సెంటర్.

యునైటెడ్ బేవరేజస్.. తెలంగాణ బేవరేజ్ కార్పొరేషన్ కు ఇవాళే లేఖ రాసింది. ఇవాళ్టి నుంచే సరఫరా ను ఆపు చేస్తున్నామని ప్రకటించింది.

బీర్ల రేట్ల పెంపు అనేది హై కోర్ట్ విశ్రాంత జడ్జి నేతృత్వంలోని ధరల నిర్ణయ కమిటీ పరిశీలనలో ఉంది.

కమీటీ నివేదిక వచ్చాక .. దానిని పరిశీలించి ధరల పెంపుపై నిర్ణయం తీసుకుంటాం.

కమిటీ నివేదిక ఇవ్వకముందే బేవేరేజ్ కార్పొరేషన్ పై ఒత్తిడి తీసుకురావడం సరికాదు.

గుత్తాధిపత్యం ఉంది కాబట్టి ఒత్తిడి చేస్తున్నారు.

ఒత్తిళ్లకు మా ప్రభుత్వం తలొగ్గదు.

బీర్ల ధరలు 33.1 శాతం పెంచాలని యు బీ కంపెనీ కోరుతుంది.

ధరలు పెంచితే మద్యంప్రియులపై భారం పడుతుంది.

ముడి సరుకుల ధరలు పెరిగితే మద్యం ధరలు పెరుగుతాయి.

యూబీ కంపెనీ మార్కెట్ షేర్ 69 శాతం ఉంది.

గత ప్రభుత్వం రాష్ట్ర మొత్తం రూ. 8 లక్షల కోట్ల అప్పులు చేసింది. బకాయిలు పెట్టింది.

వాటికి నెలకు రూ. 6500 కోట్లు నెలవారీగా అసలు వడ్డీలు చెల్లిస్తున్నాం.

రూ. 40 వేల కోట్ల పెండింగ్ బల్లులు ఉన్నాయి.

ఇందులో ఎక్సైజ్ శాఖకు సంబందించి రూ. 2.500 కోట్ల వరకు ఉంటే .. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రూ. 1130.99 కోట్లు బకాయిలు చెల్లించాం

యూబీ కంపెనీలకి కేవలం 658.95 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది.

తెలంగాణలో యూబీ బీర్లకు సంబంధించి

14 లక్షల కేసుల స్టాక్ అందుబాటులో ఉంది.

ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రంలోనే మద్యం ధరలు తక్కువగా ఉన్నాయి.

భవిష్యత్ లో కూడా మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే

తెలంగాణలో తక్కువగా ధరలు ఉండేలా చూస్తాం.

యునైటెడ్ బెవరేజెస్ కు 7-12 -2023 నాటికి 407.34 కోట్లు చెల్లించాల్సి ఉంది.

7 -12 -2023 నుంచి.. 7-1- 2025 నాటికి 1130.99 కోట్ల బకాయిలను క్లియర్ చేసిన సర్కార్.

యూబీ కంపెనీకి ప్రస్తుతం రూ.658.95 కోట్లు బకాయి చెల్లించాల్సి ఉంది.

Spread the love