అక్టోబర్ 15 మంగళవారం కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, జి. కిషన్ రెడ్డి, ఎంఓఎస్ బండి సంజయ్ తదితరులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి పూడూరులో వీఎల్ఎఫ్ స్టేషన్ ప్రాజెక్టును ప్రారంభించారు.

రంగారెడ్డి జిల్లాలోని పూడూర్ గ్రామంలో VLF స్టేషన్/నేవల్ బేస్ ఏర్పాటుపై కేంద్రానికి సహకరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

గత పదేండ్లలో అధికారంలో ఉన్న కేసీఆర్, అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వమే నేవల్ ప్రాజెక్ట్‌కు తుది ఆమోదం తెలిపింది.

వికారాబాద్ మండలం పూడురు పరిధిలోని దామగూడెం రిజర్వు ఫారెస్ట్ లో 1174 హెక్టార్ల భూమిని (2900 ఎకరాలు) ఈ రాడార్ స్టేషన్ ఏర్పాటుకు బదిలీ చేసేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం డిసెంబర్ 12, 2017న జీవో నెం.44 జారీ చేసింది.

అటవీ సంరక్షణ చట్టం, 1980లోని సెక్షన్-2 ప్రకారం విశాఖపట్నంలోని హెడ్‌క్వార్టర్స్ ఈస్టర్న్ నేవల్ కమాండ్‌కు అనుకూలంగా బీఆర్ఎస్ ప్రభుత్వమే ఆమోదం తెలిపింది.

అప్పుడు బీఆర్ఎస్ తుది ఆమోదం తెలిపిన ప్రాజెక్టును ఇప్పుడు కేటీఆర్ వ్యతిరేకిస్తున్నారు.

దేశ భద్రతకు సంబంధించిన ప్రాజెక్టును వ్యతిరేకించడం, ముందుగా ఆమోదించి ఇప్పుడు రాజకీయం చేయటం కేటీఆర్ నిజస్వరూపాన్ని తెలియజేస్తుంది

ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం దేశ భద్రత ప్రాధాన్యం దృష్ట్యా ఈ ప్రాజెక్టుకు మద్దతు ఇచ్చారు.

*ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ముఖ్యమైన వివరాలు*

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 2014 ఆగస్టు 11న అప్పటి జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్ ఆ భూముల బదలాయింపునకు సంబంధించి ఎంత చెల్లింపులు చేయాలో లెక్కలేసి డిమాండ్ నోట్ ను నెవీ విభాగానికి పంపించారు.

2017 ఫిబ్రవరి 25న పాత డిమాండ్ నోటీస్ ను పెరిగిన వేజెస్ కు అనుగుణంగా పెంచటంతో పాటు ప్లాంటేషన్ కు సంబంధించిన స్థల మార్పును సూచిస్తూ మరోసారి నెవీకి లెటర్ రాశారు.

*017 మార్చి 2న నేవీ విభాగం రాష్ట్ర అటవీ శాఖ పంపిన డిమాండ్ నోటీసు ప్రకారం రూ.133.54 కోట్లు ఖాతాలో జమ చేసింది.

2017 మే 25వ అటవీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటివ్ స్టేజ్ 1 అనుమతులకు సంబంధించిన సమగ్ర నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేశారు.

2017 జులై 31న కేంద్ర ప్రభుత్వ పర్యావరణ శాఖ మరింత అదనపు సమాచారం కోరింది.

2017 సెప్టెంబర్ 21న కేంద్రం కోరిన అదనపు సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం పంపించింది.

2017 నవంబర్ 14న కేంద్ర ప్రభుత్వం దామగూడెం రిజర్వు ఫారెస్ట్ కు చెందిన 1174 హెక్టార్ల భూముల బదిలీకి సంబంధించి స్టేజ్ 2 తుది అనుమతులు మంజూరు చేసింది.

2017 డిసెంబర్ 19న రాష్ట్ర ప్రభుత్వం అటవీ భూములను నేవీకి బదిలీ చేస్తూ జీవో నెం.44 జారీ చేసింది.

2017 డిసెంబర్ 22న తుది అనుమతులకు సంబంధించిన జీవో సంబంధిత జిల్లా అటవీ అధికారికి చేరింది.

భూసంరక్షణ చర్యలకు సంబంధించిన మొత్తం ఖర్చుల్లో 25 శాతం చెల్లింపులు చేయాలని డీఎఫ్్వ నేవీకి నోటీసు జారీ చేశారు. నేవీ విభాగం జనవరి 20వ తేదీన ఈ ఛార్జీలు రూ.18.56 కోట్లు చెల్లించింది.

Spread the love