న్యూ ఢిల్లీ సుప్రీం కోర్టు నుంచి…
గ్రూప్ 1 మెయిన్స్ లో జోక్యం చేసుకోలేమన్న సుప్రీంకోర్టు.
తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు లో ఊరట.
గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు వాయిదా వేసే అంశం పై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించిన సుప్రీంకోర్టు.
గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష ఫలితాలకు ముందే హైకోర్టులో గ్రూప్ 1 కేసు విచారణను ముగించాలన్న సుప్రీంకోర్టు.
తెలంగాణ హైకోర్టులో కేసు విచారణ కొనసాగుతున్నందున, తుది నియామకాలు హైకోర్టు తుది తీర్పునకు లోబడి ఉంటాయని హైకోర్టు స్పష్టం చేసినందున, అక్కడే విచారణ జరపాలని ఆదేశం.
ఫలితాలు వెల్లడించడానికి ముందే తుది తీర్పు ఇవ్వాలని హైకోర్టుకి సూచన.