*నేటి నుంచి ఇంద్ర కీలాద్రిపై దసరా ఉత్సవాలు..*

విజయవాడ అమ్మ వారి భక్తులకు అలర్ట్.. ఇంద్ర కీలాద్రిపై ఇవాళ్టి నుంచి దసరా ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు దుర్గ గుడి ఈఓ రామారావు ప్రకటన చేశారు..ఉత్సవాలు ముగిసే వరకూ అంతరాలయ దర్శనాలు రద్దు చేశామన్నారు.

ఈ పది రోజులు పది అవతారాల్లో అమ్మ వారు భక్తులకు దర్శనమిస్తారని చెప్పారు.ఈ ఏడాది లేజర్‌ షో కృష్ణమ్మకు హరతి ఏర్పాటు చేశామని.. ఉత్సవాలకు 15 లక్షల మంది వరకూ వస్తారని అంచనా వేస్తున్నట్లు ప్రకటించారు. ప్రతి రోజూ 9 గంటలకు చండి యాగం, 12వ తేదీన తెప్పోత్సవం, పూర్ణాహుతి ఉంటుందని చెప్పారు.విజయవాడ నగరం లోని పలు ప్రాంతాల్లో రూ. 300, రూ. 500 దర్శన టికెట్ల విక్రయాలు జరుగుతున్నాయన్నారు.

Spread the love