న్యూస్ అప్ డేట్స్ – 24/10/2024
నేడు ఆదిలాబాద్ బిఆర్ఎస్ పోరు బాటసభ.
నేడు విజయనగరం జిల్లా గుర్లాలో మాజీ సీఎం జగన్ పర్యటన.
హెచ్ సి ఏ వివాదం పై నేడు సుప్రీంకోర్టులో విచారణ.
చర్చలు, దౌత్యానికి మా మద్దతు ఇస్తాం, యుద్ధానికి మాత్రం కాదు : బ్రిక్స్ సదస్సులో మోడీ
నేడు ఎంపీలతో సౌత్ సెంట్రల్ రైల్వే సిజిఎం సమావేశం.
ట్రంప్ ను ఓడించడమే నా టార్గెట్ కమల హరీస్.
నాన్ బాస్మతి తెల్లబియ్యం ఎగుమతుల కోసం గతంలో నిర్దేశించిన కనీస ఎగుమతి ధరపై ఆంక్షలు తొలగించిన కేంద్రం.
2023లో వినోద పరిశ్రమకు 22.400 కోట్ల పైరసీ నష్టం జరిగినట్టు ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నివేదిక.
రేపటి నుంచి అమెరికాలో ఏపీ మంత్రి నారా లోకేష్ పర్యటన.
ఐసీసీ ప్రపంచ టెస్ట్ ర్యాంకింగ్లో విరాట్ కోహ్లీని పక్కనపెట్టి ఆరో స్థానానికి ఎగబాకిన రిషబ్ పంత్.
ధాన్యం కనుగోలపై తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీ నివేదిక సిద్ధం.
రెండో రోజు మూసి రివర్ జెడ్ ప్రాంతాల్లో బిజెపి నేతల పర్యటన.
నేడు మరోసారి ఈడీ ముందుకు ఐఏఎస్ అమోయ్ కుమార్.
తమిళనాడులో కురుస్తున్న భారీ వర్షాలు.
భర్తను భార్య హిజ్రా అని పిలవడం క్రూరత్వం కిందికే వస్తుందని స్పష్టం చేసిన పంజాబ్, హర్యానా హైకోర్టులు.
ఢిల్లీ,,స్కీజోప్రీనియ బాధితులు గుండెపోటుతో అకాల మరణం బారిన పడే ముప్పు నాలుగున్నర రేట్లు ఎక్కువగా ఉంటుందని తాజా అధ్యయనంలో వెల్లడి.
తూర్పు లడక్ విషయంలో భారత్ -చైనా ఒప్పంద వివరాలను దేశ ప్రజలకు వెల్లడించాలి : కాంగ్రెస్
అమెరికాలో ముందస్తు ఓటింగ్ ను ఉపయోగించుకున్న 2.1కోట్ల మంది ప్రజలు.
ఎన్నికల తర్వాత అమెరికాలో ఆందోళనలను రష్యా- ఇరాన్ కుట్ర చేస్తుందని నిఘా అధికారుల హెచ్చరిక.
బైజుస్ సుప్రీంకోర్టు షాక్ దివాలా ప్రక్రియను నిలిపివేయాలంటే నేషనల్ కంపెనీల అప్లై ఇచ్చిన తీర్పును పక్కన పెట్టిన సుప్రీంకోర్టు.
జులై సెప్టెంబర్ లో బిఎస్ఎన్ఎల్ 50 లక్షల కొత్త చందాదారులు.
నేడు సూర్యాపేటలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పర్యటన.
నేడు టిపిసిసి సోషల్ మీడియా సమన్వయకర్తల సమావేశం.
టి20లో జింబాబ్వే ప్రపంచ రికార్డ్ 20 ఓవర్లు 344 పరుగులు చేసిన జింబాబ్వే.