ప్రాణం పోయినా ప్రజల కోసం పోరాటం ఆపం: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
తెలంగాణ కోసం ఉద్యమంలోకి వచ్చిన రోజే చావుకి తెగించి వచ్చాం.
కేసులు, ప్రభుత్వాల కుట్రలు మాకు కొత్త కాదు, రేవంత్ అక్రమాలు, అవినీతి, వైఫల్యాలు ఎత్తి చూపినందుకే అక్రమ కేసులు.
ఎలాంటి చట్టవిరుద్ధ కార్యక్రమాలు లేకున్నా ప్రభుత్వ కుట్రతోనే మాపై దుష్ప్రచారం, రాజకీయ కుట్రలా?
పదకొండు నెలలుగా రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోంది.
బీఆర్ఎస్ నేతలు రాజీ లేకుండా పోరాటం చేస్తున్నారు, కేసీఆర్ నేర్పిన ఉద్యమబాటలో బీఆర్ఎస్ నేతలు నడుస్తున్నారు.
సివిల్ సప్లైస్ స్కాం, మూసీ స్కాం వంటి అన్ని రకాల రేవంత్ అక్రమాలు, అవినీతి, వైఫల్యాలు ఎత్తి చూపినందుకే అక్రమ కేసులు పెడుతున్నారు.
రాజకీయంగా ఎదుర్కోలేక కుట్రలు చేస్తున్నారు చావుకు తెగించి ఉద్యమం చేసిన వాళ్లం.. రేవంత్ రెడ్డి కుట్రలకు మేం భయపడం.
నిన్నటి నుంచి ఒక ప్రహాసనంలాగా మాపై కుట్ర నడిపే ప్రయత్నం చేస్తున్నారు.
ఈ రోజు తెలంగాణలో ఒక కుటుంబం, దీపావళికి ఇంట్లో దావత్ చేసుకోవడం తప్పా? దాని కోసం కూడా అనుమతి తీసుకోవాలా?
రాజ్ పాకాల ఇల్లు కట్టుకొని గృహప్రవేశం చేశాడు, దాని కోసం అయన కుటుంబ సభ్యులు, మిత్రులతో ఫ్యామిలీ పంక్షన్ చేసుకున్నారు.
అలాంటి కుటుంబ కార్యక్రమాన్ని రేవ్ పార్టీ అంటూ కొంత మంది పైశాచిక అనందం పొందుతున్నారు.
నేను అక్కడ లేకున్నా నా పేరుతో అడ్డగోలుగా వార్తలు ప్రచారం చేస్తున్నారు.
ప్రజా జీవితంలో ఉంటే మాపై ఏలాంటి మాటలైన, అడ్డగోలు ప్రచారం చేయవచ్చా.
అది రాజ్ పాకాల ఇల్లు, ఫాం హౌజ్ కాదు, కుటుంబ సభ్యులను పురుషులు, మహిళలు అంటూ చెప్పి అడ్డగోలుగా మాట్లాడుతున్నారు.
ఈ 21 గంటలు పరిశోధించి పట్టుకున్నది ఏంటి? అక్కడ ఏం లేదని చాలా స్పష్టంగా అధికారులే డ్రగ్స్ దొరకలేదని చెప్పారు, అయినా ఏందుకీ దుష్ప్రచారం?
కేసు అధికంగా మద్యం ఉన్న కేసు అని అబ్కారీ కేసు అని చేప్తే మళ్లీ నార్కోటిక్ కేసు అంటున్నారు. కేవలం పై వారి అదేశాల మేరకు మాత్రమే నార్కోటిక్ కేసు అంటున్నారు.
అక్కడ పార్టీలోకి చేరి అనేక మందికి టెస్టులు చేస్తే రాజ్ పాకాలకు టెస్ట్ చేస్తే నెగిటివ్ వచ్చింది, అయినా అయనను బీజేపీ, కాంగ్రెస్ నాయకులు అడ్డగోలుగా మాట్లాడుతున్నారు.
అయినా ఎన్డీపీఎస్ కేసు ఎలా పెడతారు? ఉదయం ఇచ్చిన పంచనామాకి, ఎఫ్ఐఅర్‌కి తేడా ఏలా వచ్చింది.
బాంబులు అని చెప్పి కొండను తవ్వ ఎలుకను కూడా పట్టలేదు.
ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా పోరాటాన్ని ఆపం, రేవంత్ రెడ్డి వైఫల్యాలను ఎండగడుతూనే ఉంటాం.
మీరిచ్చిన హమీల నెరవేర్చకపోవడం, ప్రజలను మోసం చేయంటం అన్ని అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లి కాంగ్రెస్ వెంటపడతాం.
ప్రజా సమస్యలను వదిలిపెట్టి కుటుంబాల వెంటపడుతున్నాడు.