ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటన.

తూర్పుమధ్య బంగాళాఖాతంలో తుపానుగా బలపడిన వాయుగుండం.

*తుపానుకు ‘దానా’గా నామకరణం*

రేపటికి వాయువ్య బంగాళాఖాతంలో తీవ్రతుపానుగా రూపాంతరం.

గడిచిన 6 గంటల్లో గంటకు 18కిమీ వేగంతో కదులుతున్న తుపాను.

గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాము లోపు తీరం దాటే అవకాశం.

*పూరీ-సాగర్ ద్వీపం మధ్య తీరం దాటనున్న తుపాను*

ప్రస్తుతానికి పారాదీప్ (ఒడిశా)కి 560 కిమీ., సాగర్ ద్వీపానికి (పశ్చిమ బెంగాల్) 630 కిమీ మరియు ఖేపుపరా (బంగ్లాదేశ్)కి 630 కిమీ. దూరంలో దానా తుపాను.

పశ్చిమమధ్య బంగాళాఖాతం తీరాల వెంబడి గంటకు 80-90 కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు.

ఇవాళ, రేపు సముద్రం అలజడిగా ఉంటుంది.

మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదు.

ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

Spread the love