ఆన్‌లైన్ గేమ్స్‌కి బలైన బీటెక్ విద్యార్థి.
వర్ధన్నపేట మండలం కడారిగూడెం గ్రామానికి చెందిన బత్తిని గణేశ్(20) హైదరాబాద్‌లోని ఘట్‌కేసర్‌లో ఓ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు.
గణేశ్ తండ్రి పదేళ్ల క్రితమే చనిపోగా, తల్లి ఫీల్డ్ అసిస్టెంట్‌గా పని చేస్తూ కుమారుడిని బీటెక్ చదివిస్తుంది. అయితే ఆన్‌లైన్ గేమ్స్‌కు బానిసైన గణేశ్ తన ఫ్రెండ్స్ దగ్గర భారీగా అప్పులు చేశాడు.
ఇటీవల దసరా పండుగకు ఇంటికి వెళ్ళిన గణేష్ కాలేజీలో ఫీజు కట్టేందుకు రూ.80 వేలు తీసుకొని, వాటిని కూడా ఆన్‌లైన్ గేమ్‌లో పోగొట్టుకున్నాడు.
దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన గణేశ్ సోమవారం కాలేజీ సమీపంలో పురుగుల మందు తాగి చనిపోయాడు. భర్త లేకపోయినా కష్టపడి కొడుకును చదివిస్తే, తాను చనిపోయాడని గణేష్ తల్లి భోరున విలపించింది.