నేడు ఢిల్లీకి తెలుగు రాష్ట్రాల సీఎంలు.

తెలుగు రాష్ట్రాలు సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి ఆదివారం ఢిల్లీకి వెళ్లనున్నారు.

తీవ్రవాద నిరోధంపై అన్ని రాష్ట్రాల సీఎంలతో కేంద్ర హోం శాఖ నిర్వహించే సమావేశానికి వీరివురు హాజరు కానున్నారు. మరోవైపు వరద పరిహారం విషయమై సీఎం రేవంత్ కేంద్ర మంత్రులను కలిసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పర్యటనలోనే కాంగ్రెస్ అగ్రనేతలను సీఎం రేవంత్ కలవొచ్చని అధికార వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు పెండింగ్లో ఉన్న రాష్ట్రం మంత్రివర్గ విస్తరణ పై కూడా అధిష్టానంతో రేవంత్ రెడ్డి చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇక హాట్ హాట్ గా కొనసాగుతున్న కొండా సురేఖ నాగార్జున సమంత వ్యవహారంపై కూడా అధిష్టానం సీఎంకు వార్నింగ్ ఇచ్చే అవకాశం ఉంది.

Spread the love