*@మహారాష్ట్ర లోనీ నాందేడ్ నుండి*

*మహారాష్ట్ర ఎన్నికలపై కాంగ్రెస్ కసరత్తు*

*రంగంలోకి దిగిన ఏ.ఐ.సి.సి పరిశీలకులు కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి,సచిన్ పైలెట్ లు*

*సమన్వయ సమావేశాలతో లీడర్ కు,క్యాడర్ కు మార్గదర్శనం*

*మహారాష్ట్రలో పూర్వవైభవం సాధించే దిశగా కార్యాచరణ*

*దక్షిణాదిలో పట్టు సాధించేందుకు వ్యూహా రచన*

కర్ణాటక,తెలంగాణా రాష్ట్రాలలో సంచలన విజయాలు నమోదు చేసుకున్న కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్రలోనూ విజయం సాధించి దక్షిణాదిన పట్టు సాధించేందుకు గట్టి కసరత్తు మొదలు పెట్టింది.

కలసి వచ్చే భాగస్వామ్య పక్షాలతో సమన్వయం చేసుకుని సీట్ల సర్దుబాటు అంశంలో ఎటువంటి భిన్నాభిప్రాయాలు లేకుండా చూసేందుకు ఆ పార్టీ కార్యాచరణ రూపొందించింది.

ఈ మేరకు ఏ.ఐ.సి.సి నుండి పరిశీలకులుగా నియమితులైన సీనియర్ కాంగ్రెస్ నేతలు రాష్ట్ర నీటిపారుదల మరియు పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి,సచిన్ పైలెట్ లు బుధవారం రోజున మహారాష్ట్ర లోని నాందేడ్ లో సమన్వయ సమావేశం నిర్వహించి లీడర్ తో పాటు క్యాడర్ కు ఎన్నికల రూట్ మ్యాప్ పై దిశా దశలు నిర్దేశించారు.

ఇప్పటికే తెలంగాణా,కర్ణాటక రాష్ట్రాలలో సంచలన విజయాలు నమోదు చేసుకున్న కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్ర లోనూ భాగస్వామ్య పక్షాలతో కలిసి విజయం సాధించి దక్షిణాదిలో బిజెపి దూకుడుకు ముకు తాడు వేసేందుకు గట్టి ప్రయత్నాలు మొదలు పెట్టింది.

తద్వారా మహారాష్ట్ర లో కాంగ్రెస్ పార్టీకీ పూర్వ వైభవం సంతరించుకునేలా ఆ పార్టీ చేసిన వ్యహరచనను నాందేడ్ లో జరిగిన సమన్వయ సమావేశంలో పరిశీలకులుగా వెళ్లిన కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి,సచిన్ పైలెట్ లు మార్గదర్శనం చేశారు.

Spread the love