*ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కామెంట్స్@ దివంగత గడ్డం వెంకటస్వామి జయంతి వేడుకలు*
మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ప్రభుత్వం మిమ్మల్ని అనాథలను చేయదు.. మీకు ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసే బాధ్యత ప్రభుత్వానిది.
మూసీ రివర్ బెడ్, బఫర్ జోన్ లో ఉన్నవారిని ప్రభుత్వం ఆదుకుంటుంది..రెచ్చగొట్టే వారి మాటలు నమ్మొద్దు… ప్రభుత్వం స్పష్టమైన విధానంతో ముందుకు వెళుతుంది..ఫామ్ హౌస్ లను కాపాడుకునేందుకు పేదల ముసుగు అడ్డుపెట్టుకునే వారి మాటలు వినొద్దు.
ఈ వేదికగా పేదలకు ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా..మీ మంచి కోసమే ప్రభుత్వం ఆలోచన చేస్తోంది..మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలు ఆందోళనకు గురికావద్దు…మూసీ పరివాహక పేదలను ఆదుకునేందుకు రూ.10 వేల కోట్లు ఖర్చు చేయడానికైనా సిద్ధంగా ఉంది..
ఈటెల, కేటీఆర్, హరీష్ కు సూచన చేస్తున్నా..మూసీ పరివాహక ప్రాంత ప్రజలను ఎలా ఆదుకుందామో సూచనలు ఇవ్వండి..మా ప్రభుత్వానికి ఎవరిపై కోపం లేదు..ప్రజలకు మేలు చేయడమే మా ప్రభుత్వ ఎజెండా..నరేంద్ర మోదీ సబర్మతీ నదిని అభివృద్ధి చేస్తే చప్పట్లు కొట్టి గొప్పలు చెబుతున్నారు..మరి సబర్మతిలా మూసీని అభివృద్ధి చేస్తే వచ్చిన ఇబ్బంది ఏమిటి?
కాకా స్పూర్తితో పేదలకు మెరుగైన వసతులు కల్పిద్దాం..కేసీఆర్, కేటీఆర్ కు నిజంగా పేదలపై ప్రేమ ఉంటే ఫామ్ హౌస్ లో కొంత భూమిని పేదలకు దానం చేయండి…మీరు ఫామ్ హౌజుల్లో జమీందారుల్లా బతుకుతారు… పేదలు మాత్రం మూసీ ముంపులో బతకాలా? అవసరమైతే మలక్ పేట్ రేస్ కోర్టును, అంబర్ పేట్ పోలీస్ ఆకాడమీని హైదరాబాద్ బయటకు తరలించి పేదలకు ఇండ్లు కట్టిద్దాం..
పేదోళ్లకు ఏం చేద్దామో ఆలోచన చేద్దాం ముందుకు రండి..మీ ఆస్తులు ఇవ్వకపోయినా పరవాలేదు.. మీ అనుభవంతో ఏం చేద్దామో చెప్పండి..అంతే కానీ.. ప్రభుత్వం ఏం చేసినా కాలకేయ ముఠాలా అడ్డుపడటం సరికాదు.
ఐదేళ్లలో వాళ్లు చేసిన రుణమాఫీ కేవలం రూ.11వేల కోట్లు.. నెలరోజుల్లో మేం రూ.18వేల కోట్లు రైతు రుణమాఫీ చేసాం..దయచేసి రైతులెవరూ రోడ్డెక్కొద్దు.. సమస్య ఉంటే కలెక్టర్ ను కలవండి..సోషల్ మీడియాతో అధికారంలోకి వస్తామని కొందరు కలలు కంటున్నారు….సోషల్ మీడియాతో అధికారంలోకి రావడం కాదు.. వాళ్లు చర్లపల్లి జైలుకు వెళ్లడం ఖాయం..