రేపు ఎస్సీ వర్గీకరణ జీఓ విడుదల చేయనున్న తెలంగాణ రాష్ట్ర సర్కార్.

 

దేశంలోనే ఎస్సీ వర్గీకరణ అమలు కు జీఓ విడుదల చేస్తున్న తొలి రాష్ట్రంగా తెలంగాణ రికార్డ్.

ఇప్పటికే అసెంబ్లీలో వర్గీకరణ బిల్లుకు ఆమోదం. బిల్లుకు గవర్నర్ రాజముద్ర.

సచివాలయంలో ఎస్సీ వర్గీకరణ క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం.

ఎస్సీ వర్గీకరణ క్యాబినెట్ సబ్ కమిటీ చైర్మన్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన సబ్ కమిటీ సమావేశం.

సమావేశంలో పాల్గొన్న సబ్ కమిటీ వైస్ చైర్మన్,మంత్రి దామోదర్ రాజా నర్సింహ, సభ్యులు,మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, ఏక సభ్య కమిషన్ చైర్మన్ శమీమ్ అక్తర్, సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీధర్, న్యాయ శాఖ కార్యదర్శి తిరుపతి తదితరులు…

*ఉత్తమ్ కుమార్ రెడ్డి, నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి…*

రేపు ఉదయం 11 గంటలకు మరో సారి బేటీ కానున్న ఎస్సీ వర్గీకరణ సబ్ కమిటీ.

రేపు ఉదయం ఎస్సీ వర్గీకరణ జి.ఓ విడుదల చేస్తాం.

జి.ఓ మొదటి కాపీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి అందజేస్తాం.

Spread the love