ఈటెల రాజేందర్
నీకు దమ్ముంటే నేను మీరు ఇద్దరం వితౌట్ సెక్యూరిటీ మూసి పరివాహక ప్రాంతంలో కూలగొట్టబోతున్న ఇళ్ళ దగ్గరికి పోదామా?ఒకరోజు రెండు రోజుల డేట్ పెట్టండి. చైతన్యపురిలాంటి కాలనీలకు పోదాం.
శభాష్ రేవంత్ రెడ్డి అంటే నేను రాజకీయాల నుండి తప్పుకుంటాను. బహిరంగంగా క్షమాపణ చెప్పి ముక్కు నేలకు రాస్తాను.
చట్టం సిస్టం లేని అరాచక శక్తివి నీవు.
బై డిఫాల్ట్ సీఎం అయ్యావు.
మేము బరిగేసి కొట్లడిన నాడు నువ్వు ఆంధ్రపాలకుల సంకలో ఉన్నావు.
నేను కానీ మా పార్టీ గాని అభివృద్ధికి వ్యతిరేకం కాదు.
మూసి ప్రక్షాళనకు కూడా వ్యతిరేకం కాదు.
చెరువులు బాగుచేయటానికి కూడా మేము వ్యతిరేకం కాదు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జుగుప్సకరంగా మాట్లాడుతున్నారు.
పిట్టల దొరలా మాట్లాడుతున్నారు.
సిఎంలాగా కాకుండా బ్రోకర్ లా మాట్లాడుతున్నారు అని ప్రజలు అంటున్నారు. నేను కాదు.
కంటోన్మెంట్ లో మీటింగ్ పెట్టీ
సన్నాసులు, పిచ్చికుక్కలు కరిచిపోతారు అని మాట్లాడుతున్నారు.
బతకొచ్చిన వాడు అని మాట్లాడుతున్నారు.
చదువుకుంటే సంస్కారం వచ్చేది,
ఇతరులు చెప్పేది వింటే జ్ఞానం వస్తుండే.
నేను చదువుకుంది కేశవ్ మెమోరియల్ స్కూల్,
నా జూనియర్ కాలేజీ అలియా జూనియర్, గన్ఫౌండ్రి,
డిగ్రీ కాలేజీ సైఫాబాద్ సైన్స్ కాలేజీ,
నా బిజినెస్ అంతా ఇక్కడే,
నన్ను పట్టుకొని బతుకొచ్చుకొనేవాడు అంటున్నాడు.
నీ పిచ్చి మాటలకు తెలంగాణ సమాజం సిగ్గు పడుతుంది.
నీవు ఎంఎల్ఏ గా 5 ఏళ్లు ప్రజల మధ్యలో ఉంది సర్వీస్ చేశావా ?
మల్కాజిగిరి ప్రజలు నిన్ను గెలిపిస్తే మొఖం చూడకుండా మోసం చేసావు. ఒక్కనాడన్నా నిలబడి పని చేయదు.
మంత్రిగా పనిచేసి ఉంటే సిస్టమ్ తెలిసేది.
నీళ్ళమ్మీద దెబ్బలు కొట్టినట్టు పనిచేసారు.
అబద్దాల పునాల మీద బ్రతికారు.
బ్రోకర్ మాటల మీద బ్రతుకుతావు తప్ప ప్రజలకు సేవ చేయలేదు అని ప్రజలే అంటున్నారు.
నేను కానీ మా పార్టీ గాని అభివృద్ధికి వ్యతిరేకం కాదు.
మూసి ప్రక్షాళనకు కూడా వ్యతిరేకం కాదు.
చెరువులు బాగుచేయటానికి కూడా మేము వ్యతిరేకం కాదు.
పేదలకు ఇల్లు కట్టించడానికి, మూసి ప్రక్షాళనకు, చెరువులను కొబ్బరినీళ్ళ లెక్క చేస్తానన్న వ్యతిరేకం కాదు.
మేము అడిగేది..
ఆరు వ్యారెంటీలు, 66 హామీలు, 420 పనులు చేస్తామని చెప్పారు..
రైతుల కోసం వరంగల్లో రాహుల్ గాంధీ చేత, సోనియాగాంధీ చేత, ప్రియాంక గాంధీ చేత, ఖర్గేగారి చేత గ్యారెంటీల సభలు పెట్టారు.
ఆరు గ్యారెంటీలలో ఒక్క పని కూడా చేయలేదు.
మహిళాపాలసీలో ఆర్టీసీలో ఉచిత బస్సు తప్ప 2500 ఇవ్వలేదు, తులంబంగారం ఇవ్వలేదు, 20 లక్షల వడ్డీ లేని రుణాలు ఇవ్వలేదు.
రైతులారా వెంటనే రుణం తీసుకుని చెప్పారు కానీ రుణమాఫీ చేయలేదు. 500 రూపాయల బోనస్, 3 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణం, 18 వేల రైతు భరోసా, కౌలురైతులకు డబ్బులు, రైతు కూలీలకు 12 వేల రూపాయలు ఏది కూడా ఇవ్వలేదు.
తేమ్స్, సబర్మతి, గంగాప్రక్షాళన అని మాట్లాడుతున్న మీరు..
1,50,000 కోట్లు మూసీ నదికోసం కేటాయిస్త అని చెప్తున్నారు.
తెలివి ఉందా లేదా ? సమాచారంతో మాట్లాడి కదా ?
సబర్మతి రీవర్ ఫ్రంట్ కి 1400 కోట్లు ఖర్చు పెడుతున్నారు.
2511 కిలోమీటర్లు గంగా ప్రక్షాళన కోసం.. 50 కోట్ల జనాభాను తాకే ప్రాజెక్ట్ గంగానమామి కోసం 20 వేల కోట్లు ఖర్చు చేశారు.
మరి మూసీ కోసం నువ్వు పెట్టేది 1.5 లక్షల కోట్లా.
ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు నాలుగు నెలలుగా జీతాలు లేవు. దవాఖానాలలో మూడు నెలలుగా మందులు లేవు.
మూడు సంవత్సరాలుగా గ్రామపంచాయతీలో పనిచేసిన వారికి బిల్లులు ఇవ్వడం లేదు. ఇల్లు ఇవ్వకపోతే చచ్చిపోతామని వారంతా చెపుతున్నారు. రిటైర్డ్ ఉద్యోగులకు డబ్బులు రావడం లేదు.
ఆర్టీసీ కి ఇచ్చిన 280 కోట్ల చెక్కు బౌన్స్ అయింది.
ఈ రాష్ట్రం అప్పుల ఊపులో కూరకు పోయిందని, అసెంబ్లీ వేదికగా చెప్పారు నెలకు ₹7 వేల కోట్ల డబ్బులు కట్టే పరిస్థితి వచ్చిందని మీరే చెప్పారు. తెచ్చుకున్న అప్పుకే వడ్డీలు కట్టె పరిస్థితి లేదు.. ఆర్థిక పరిస్థితి నాశనమైందని ఇవ్వాలనుకున్న కూడా ఇవ్వలేక పోతున్నా అని చెప్తున్న మీరు ఒక లక్ష 50 వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి తీ సుకురాగలరు చెప్పగలరా ?
కాలేశ్వరం ప్రాజెక్టు వల్ల లక్ష కోట్ల రూపాయలు గోదావరి పాలు అయింది అన్నారు. మిషన్ భగీరథ పేరిట నలభై వేల కోట్ల రూపాయలు డబ్బులు కేసీఆర్ తిన్నారని మీరు చెప్పారు.
ఒక రాష్ట్రం అప్పు తేవాలంటే జి ఎస్ డి పి లో 25% కంటే ఎక్కువ దాటకూడదు కానీ ఇప్పటికే దాటింది మళ్లీ కొత్తగా రుణం వచ్చే అవకాశం లేదు. మరి మూసి ప్రక్షాళన కోసం ఎలా తీసుకొస్తారు.
నీ రోడ్డు మ్యాప్ ఏంటి ? డిపిఆర్ ఏంటి ?
ఎప్పటినుంచి ఎప్పటి వరకు పూర్తి చేస్తావు ?
దేనికి ఎంత ఖర్చవుతుంది ?
ఎవరు దీనికి కాంట్రాక్టర్ చెప్పాల్సిన బాధ్యత మీ మీద లేదా.
కేసిఆర్ నిజస్వరూపం తెలవడానికి ఆరు సంవత్సరాలు పడితే.. రేవంత్ రెడ్డి ఆరు నెలలనే బయటపడ్డారు. కేసీఆర్ ను నిలవరించే సత్తా ప్రజలకు మాత్రమే ఉంది అనుకున్నాము ఆయన్ని బొందపెట్టారు.
రేవంత్ రెడ్డి నిజ స్వరూపం మీరు చూశారు. అమెరికాలో ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు..
అబద్ధాలు ఆడే నాయకున్ని ప్రజలు ఇష్టపడతారు.. మోసం చేసే పార్టీలకే ఓటు వేస్తారు అన్నారు.
మోసం అబద్ధాలకు మారుపేరు రేవంత్.
పచ్చకామెర్లు ఉన్నవాడి లాగా మమ్మల్ని సన్నాసులు అంటున్నారు.
నీకు దమ్ముంటే .. నేను మీరు ఇద్దరం వితౌట్ సెక్యూరిటీ మూసి పరివాహక ప్రాంతంలో కూలగొట్టబోతున్న ఇళ్ళ దగ్గరికి పోదామా.. ఒకరోజు రెండు రోజుల డేట్ పెట్టండి. చైతన్యపురిలాంటి కాలనీలకు పోదాం .శభాష్ రేవంత్ రెడ్డి అంటే నేను రాజకీయాల నుండి తప్పుకుంటాను. బహిరంగంగా క్షమాపణ చెప్పి ముక్కు నేలకు రాస్తాను..
హరీష్ రావు రాసిస్తే ఈటల చదువుతున్నారు అని రేవంత్ మాట్లాడుతున్నారు. నీకేమన్నా జ్ఞానం ఉందా. నీకు కొన్ని వందల స్పీచ్ లు ఉంటాయి. ఒకసారి అసెంబ్లీ వెబ్సైట్లోకి వెళ్లి కొట్టి చూడండి.
మేము బరిగేసి కొట్లడిన నాడు.. నువ్వు ఆంధ్రపాలకుల సంకలో ఉన్నావు. ఎయిర్ గన్ పట్టుకొని పిట్టల దొర లెక్క కరీంనగర్ పోయినవు. నువ్వా మా గురించి మాట్లాడేది.
మోడీ గీడీ అన్నవాడు ఎటు పోయాడో చూసాం.
ప్రోటోకాల్ ఇష్యు పై పార్లమెంటు స్పీకర్ కు కంప్లయింట్ చేస్తాం.
చట్టం సిస్టం లేని అరాచక శక్తివి నీవు.
బై డిఫాల్ట్ సీఎం అయ్యావు.
సికింద్రాబాద్ నాంపల్లి చర్లపల్లి అభివృద్ధికి నిధులు ఎవరు ఇచ్చారు. లక్ష కోట్ల రూపాయల రోడ్లకు నిధులు ఎవరు ఇచ్చారు.
Frbm రుణాలు కూడా కేంద్రము అనుమతి ఇవ్వాలి.
16త్ ఫైనాన్స్ కమిషన్ నిధులు, సెంట్రల్ స్పాన్సర్ నిధులు, పన్నుల్లో రాష్ట్రం వాటా మీరు అడగకున్నా వస్తుంది..
నీలాగా లక్ష కోట్ల రూపాయలు చెప్పి 60 వేల కోట్లు ఖర్చుపెట్టి పద్ధతి ఉండదు.
మంత్రులు మాట్లాడే భాషలు రాజకీయ నాయకులుగా సిగ్గుపడే పరిస్థితి తీసుకొచ్చారు. సంస్కారమతంగా దేవుడు ఎరుగు చాలా వినకూడని సిగ్గుపడే భాష ఉంది.
ప్రజలకు ఆదర్శవంతంగా ఉండాల్సిన వారు ఇలా మాట్లాడటం ఎటు పోతుందో చూడాలి.
అరాచక పద్ధతిలేని వారిని కట్టడి చేసే బాధ్యత ప్రజలకే ఉంటుంది.
వారి విజ్ఞతకే వదిలేస్తున్నాను.
నేను అచ్చం తెలంగాణ మట్టి బిడ్డను.
నన్ను బ్రతకవచ్చినాడు అంటే ఇంకా నేనే మాట్లాడాలి.
కొడంగల్ లో బొందపెడితే ప్రశ్నించే గొంతుని గెలిపించండి అని మల్కాజ్గిరి అడిగితే గెలిపించారు. అన్నం పెట్టిన వారికి సున్నం పెట్టారు. చెరువు బాధితులు ఎక్కువమంది మల్కాజ్గిరిలో ఉన్నారు.