లిక్కర్ ‘లక్’ దక్కింది.. 4 షాపులు దక్కించుకున్న ‘గణేష్’

ఇటీవల గణేష్ నవరాత్రుల సందర్భంగా మీడియా లో పాపులరైన ఖమ్మం జిల్లా వాసి కొండపల్లి గణేష్. మరోసారి వార్తల్లో నిలిచారు.

ఏపీలో జరిగిన మద్యం దుకాణాల కేటాయింపులో లాటరీ ద్వారా ఏకంగా 4 దుకాణాలు దక్కించుకుని తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. పుట్టపర్తిలో – 1, నంద్యాలలో 3 షాపులు దక్కించుకుని మరోసారి ప్రముఖడయ్యాడు.

గణేష్ నవరాత్రుల సందర్భంగా గేటెడ్ కమ్యూనిటీ అయిన ‘మై హోం భుజ’ లో జరిగిన లడ్డూ వేలం పాటలో గణేష్ ఏకంగా రూ. 29 లక్షలకు లడ్డూ దక్కించుకుని ట్రెండింగ్ లో నిలిచిన విషయం విదితమే.

Spread the love