సద్దుల బతుకమ్మ పండుగ.. నగరంలో ఈ రూట్ బంద్.
హైదరాబాద్: సద్దుల బతుకమ్మ వేడుకల సందర్భంగా ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో హైదరాబాద్ పోలీసులు అంక్షలు విధించారు.
అమర వీరులు స్మారక స్థూపం నుంచి అప్పర్ ట్యాంక్ బండ్ లోని బతుకమ్మ ఘాట్ వరకు సాధారణ వాహనాలకు అనుమతించరు. సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి.
వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలని సూచించారు. ప్రస్తుతం హుస్సేన్ సాగర్ చుట్టూ బతుకమ్మ వేడుకల కోసం ఏర్పాట్లు చేస్తున్నారు.