*కేటీఆర్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం వల్లే భావోద్వేగంతో నిన్న నేను గాంధీభవన్ లో మాట్లాడాల్సి వచ్చింది…*

కొండా సురేఖ లేటెస్ట్ కామెంట్స్..

కేటీఆర్ గతంలో వ్యవహరించిన తీరు, మహిళలను చులకనగా చూసిన విధానం, ఆయన క్యారెక్టర్ గురించి విమర్శలు చేయాల్సి వచ్చింది…

ఆ సందర్భంలో నాకు ఇంకెవరిపైన ద్వేషంగానీ కోపంగాని నాకు లేవు… అనుకోని ఆ సందర్భంలో ఒక కుటుంబం గురించి తీయడం అది అనుకోకుండా నా నోటి నుండి వచ్చింది…

ఆ కుటుంబం ట్వీట్ చూసిన తర్వాత నేను చాలా బాధపడ్డాను… నేను ఏ విషయంలోనైతే బాధపడుతున్నానో ఆ విషయంలో నేను ఇంకొకరిని నొప్పించాను అని తెలిసి రాత్రి నా వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటూ ట్వీట్ చేశాను… నాకు జరిగిన అవమానం, బాధ ఇంకొకరికి జరగకూడదని భేషరతుగా నా వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నాను… కేటీఆర్ విషయంలో తగ్గేదే లేదు… నా విషయంలో క్షమాపణ చెప్పి తీరాల్సిందే… తను క్షమాపణ చెప్పకుండా నన్నే క్షమాపణ చెప్పాలనడం దొంగే దొంగ అన్నట్లుంది… కేటీఆర్ విషయంలో మాత్రం వెనక్కి తగ్గేది లేదు…

Spread the love