
ఇంచియాన్, దక్షిణ కొరియా నుంచి..
దక్షిణ కొరియా ఇంచియాన్ నగరం లో భాగమైన చియోంగ్న, సాంగడో, YEONGJONG మూడు అంతర్జాతీయ స్మార్ట్ సిటీలను సందర్శించిన తెలంగాణ మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి,ఎమ్మెల్యేలు మల్రెడ్డి రంగారెడ్డి కాలే యాదయ్య, ప్రకాష్ గౌడ్, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్, మూసి రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ అధికారులు.
ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ..
దక్షిణ కొరియా ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడం కోసం 2003లో ఇంచియాన్ ఫ్రీ ఎకనామిక్ జోన్ స్థాపించబడింది. ఫైనాన్స్ టూరిజం వ్యాపారం కోసం ఒక ఐటీబీటీ హబ్ ను నాలెడ్జ్ మరియు సర్వీస్ ఇండస్ట్రీని స్థాపించారు. ఇది లాజిస్టిక్స్ మరియు టూరిజం పై దృష్టి సారిస్తుంది.
3 అంతర్జాతీయ స్మార్ట్ నగరాల వివరాలు.
1) CHIYONGNO అంతర్జాతీయ నగరంలో సుమారుగా 98.060 జనాభ (36.184 గృహాలు) కలిగి ఉంటారు. ఈ ప్రాజెక్టు వ్యవది 2003 నుండి 2024వరకు , ప్రాజెక్టు ప్రాంతం 17.8 కిలోమీటర్స్, ప్రాజెక్టు అంచనా ఖర్చులు 6.58 ట్రిలియన్లు (0.4లక్షల కోట్లు ).
2) SANGDO నగరం లో జనాభ 265,611(104,112గృహాలు ) కలిగి ఉంటారు. ప్రాజెక్టు అంచనా ఖర్చు 21.5 ట్రిలియన్లు, 1.2 లక్షల కోట్లు, ప్రాజెక్టు వ్యవధి 2003 నుండి 2013 వరకు.
3) YEONGJONG నగరంలో అంచనా జనాభా 179,982( 69 815 గృహాలు ) కలిగి ఉంటారు. ప్రాజెక్టు అంచనా ఖర్చు 13.31 ట్రిలియన్లు (0.8లక్షల కోట్లు ) ప్రాజెక్టు వ్యవధి 2003 నుండి 2027 వరకు, ప్రాజెక్టు ప్రాంతం 51.18 కిలోమీటర్స్.
ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ డైరెక్టర్ యుంగ్ జే సన్ తో పాటు సభ్యులు కియాన్, చాగిల్ సాంగ్ మరియు అధికారులు పాల్గొన్నారు.