
ప్రతీ ఆదివారం *మై వీక్లీ డోస్ ఆఫ్ ఫోటోగ్రఫీ* పేరుతో తాను తీసిన పక్షుల చిత్రాలను ఎక్స్ ద్వారా ట్వీట్ చేస్తున్నారు మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్.
ఈ వారం విభిన్న కొంగ జాతి ఫోటోలతో అలరించారు. ఎర్రవల్లి పరిసర ప్రాంతాల్లో క్లిక్ మనిపించిన *పెయింటెడ్ స్టోర్క్* కొంగల ఫోటోలు ప్రకృతి అందాలకు వన్నె తెచ్చాయి.
చేపల కోసం వెతుకుతూ
బిడ్డకు వేట నేర్పుతున్న కొంగతో పాటు ఆకాశంలో విహరిస్తున్న పెయింటెడ్ స్టోర్క్ ఫోటోలు ఆకర్షణీయంగా ఉన్నాయి.
హిమాలయాలలో పాటు
దక్షిణ, ఆగ్నేయ ఆసియా ప్రాంతాల్లో ఎక్కువగా కనిపించే ఈ కొంగలు మన ప్రాంతానికి వలస వస్తాయి.
చిత్తడి నేలలు ప్రాంతాల్లో ఆవాసాలు ఏర్పాటు చేసుకొని జీవనం సాగిస్తాయి.