TSSA సంఘం ఇందుమూలముగా సచివాలయ ఉద్యోగులు మరియు అధికారులకు పెండింగ్ లో ఉన్న నాలుగు DA లపై ఒక సగటు ఉద్యోగికి జరుగుతున్న నష్టం గురించి మీ అందరి దృష్టికి తేవడానికి మా వంతు ప్రయత్నం.
డిఎ అనేది ప్రభుత్వ ఉద్యోగుల జీతం నిర్మాణంలో కీలకమైన అంశం ఇది నిత్యవసర వస్తువుల ద్రవ్యోల్బణం మరియు పెరుగుతున్న ధరలను భర్తీ చేయడానికి కాలానుగుణంగా సవరించబడే జీవన వ్యయ సర్దుబాటు. ప్రభుత్వ ఉద్యోగులు ముఖ్యంగా ఆర్థిక అనిశ్ఛితి సమయంలో సహేతుకమైన జీవన ప్రమాణాలను కొనసాగించడంలో డిఏ కీలక పాత్ర పోషిస్తుంది. వారి కొనుగోలు శక్తిపై ద్రవ్యోల్బణ ప్రభావాన్ని తగ్గించడం ద్వారా ప్రభుత్వ సిబ్బందిలో ధైర్యాన్ని మరియు ఉద్యోగ సంతృప్తిని పెంచడానికి డిఎ సహాయపడుతుంది.
ఇంతటి ప్రభావం ఉన్న డిఏ ను రాష్ట్ర ప్రభుత్వం చివరిసారిగా అనగా తేదీ 19.06.2023 న 20.02% నుండి 22.75% నకు సవరించింది. ఈ సవరణ 01.01.2022 నుండి అమలు పరచడం ద్వారా ప్రభుత్వ ఉద్యోగుల డిఏ లో 2.73% పెంపుదల కనిపించింది. ఆ తరువాత తేదీ నుండి రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల డిఏ లో ఎటువంటి సవరణ చేయలేదు కానీ కేంద్ర ప్రభుత్వం సమయానుగుణంగా జులై 2022, జనవరి 2023, జూలై 2023 మరియు జనవరి 2024 కాలానికి తన ఉద్యోగుల డిఏ ను సవరించడం జరిగింది.
జులై 2024 కాలానికి డిఏ ని ఇంకా కేంద్ర ప్రభుత్వం సవరణ చేయలేదు. అందుకే మన రాష్ట్రంలో నాలుగు డిఏలు మాత్రమే పెండింగు లో ఉన్నాయని మొదట్లో మీకు తెలపడం జరిగినది. రాష్ట్ర ప్రభుత్వం తన ఉద్యోగులకు పైన ఉదాహరించిన కాలాలకు అనగా జూలై 2022 నుండి జనవరి 2024న డిఏను సవరించకపోవడం చేత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఒక కాలానికి 3.64% చొప్పున మొత్తంగా 14.56% డిఎ ను నష్టపోవడం జరిగినది. ఈ జాప్యం వలన 50 వేల రూపాయలు బేసిక్ జీతం గా ఉన్న ఒక సగటు ప్రభుత్వ ఉద్యోగి నెలకు 7,280 రూపాయలను జనవరి 2024 నుండి 10 నెలలుగా నష్టపోతూనే ఉన్నాడు. అంతకు ముందు కాలానికి అనగా ప్రతి ఆరు నెలలకు ముందు మొత్తం 18 నెలలకు గాను 10.92% ,7.28%, 3.64% చొప్పున డిఏ ను నష్టపోవడం జరిగింది.
కాలానుగుణంగా డిఎ సవరణ జరగకపోవడం చేత సగటు ఉద్యోగులకు జరుగుతున్న నష్టాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ జాప్యం మరింత జరగకుండా ఉండేందుకు TSSA సంఘ నాయకులు పైన ఉదాహరించిన విషయాలను ప్రభుత్వ సలహాదారు అయిన శ్రీ వేం నరేందర్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి దసరా కానుకగా పెండింగ్ లో ఉన్న డిఏ లను రిలీజ్ చేసే విషయన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లవలసిందిగా కోరడమైనది.
ఈ విషయమై వారు సానుకూలంగా స్పందిస్తూ పై విషయాలను గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్లి త్వరలోనే సానుకూల నిర్ణయం తీసుకునేలా చూస్తాను అని హామీ ఇచ్చారు.