ఉద్యోగులు ఎదుర్కొంటున్న జీఓ 317 సమస్యను వెంటనే పరిష్కరించండి.

317 జిఓలో స్థానికతను కూడా పరిగణలోకి తీసుకురావాలి.

సీఎస్ ను కోరిన ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వి.లచ్చిరెడ్డి.

రాష్ట్రంలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న జీఓ నం.317 సమస్యను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మెన్ వి.లచ్చిరెడ్డి పేర్కొన్నారు.

ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై గురువారం సీఎం రేవంత్ రెడ్డిని తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మెన్ వి.లచ్చిరెడ్డి ఆధ్వర్యంలో జేఏసీ నాయకులు కలిసి పలు అంశాలపై చర్చించిన విషయం తెలిసిందే.

అందులో భాగంగా శుక్రవారం లచ్చిరెడ్డి ఆధ్వర్యంలో జేఏసీ నాయకులు సీఎస్ శాంతి కుమారుని కలిసి జీఓ నెంబర్ 317పై పలు విషయాలను చర్చించారు. జీఓ 317పై పలు సందేహాలు, సూచనలు చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు ఎదుర్కొంటున్న 317 సమస్యపై క్యాబినెట్ సబ్ కమిటీ వేయడం, సకాలంలోనే కమిటీ నివేదిక ఇవ్వడం పట్ల ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

మెదక్, సిద్దిపేట, నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాలో 317 జీఓతో ఉద్యోగులు తీవ్రంగా నష్టపోయారన్నారు.

317 జిఓకు సంబంధించి ఇబ్బందులు ఏ ఉద్యోగికి ఈ జీవో కింద అన్యాయం కాకుండా చర్యలు చేపట్టాలని కోరారు.

317 జిఓకు సంబంధించి ఉద్యోగుల తరపున అభ్యంతరాలను సచివాలయంలో శుక్రవారం జేఏసి ప్రతినిధులతో కలిసి లచ్చిరెడ్డి అందచేశారు.

 దీంతోపాటు 317 జీఓకు స్థానికతను కూడా పరిగణలోకి తీసుకోవాలని, కేబినెట్ భేటీలో తాము పేర్కొన్న అంశాలను చర్చించేలా చూడాలని వారు సిఎస్‌కు విజ్ఞప్తి చేశారు.

 కేబినెట్ సబ్ కమిటీ ఇచ్చిన నివేదికలో స్పౌజ్, మ్యూచువల్, హెల్త్ గ్రౌండ్ వాళ్లకు న్యాయం చేయాలని ఉన్నట్లుగా తెలుస్తోందన్నారు.

317 జిఓపై ఆలోచించి చాలా జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. ప్రెసిడెన్షల్ రూల్స్ అడ్డుగా ఉన్నాయని ఆయన తెలిపారు.

317 జీఓను నాడు అడ్డుకోవడంలో ఉద్యోగ సంఘాల నేతలు విఫలం అయ్యారని ఆయన ఆరోపించారు.

2018 లో జోనల్ వ్యవస్థ అవగాహన లేకుండా అంతకు ముందు ఉన్న 5, 6 జోన్ లను ఏ జోన్ కు సంభందించిన జిల్లాలను ఆ జోన్ లోనే విభజించి కొత్త జోన్స్ చెయ్యాల్సింది.

కానీ అలా చేయకుండా అప్పటి 6వ జోన్ లోని కొన్ని జిల్లాలు ఉదా.. మెదక్, నిజామాబాద్, కామారెడ్డి, సిద్దిపేట ఇప్పుడున్న మల్టి జోన్ 1 కు బదలయాయించారని గుర్తు చేశారు.

అదేవిధంగా జనగామ జిల్లాను ఇప్పుడున్న మల్టి జోన్ 2 కు బదలయించడం జరిగిందన్నారు.

జీఓ 317లో భాగంగా ఉద్యోగులను జోనల్ వారీగా సర్దుబాటు చేసే క్రమంలో అనేక తప్పిదాలు.

1.ఆశాస్ర్రీయమైన జోనల్ విభజన వల్ల చాలా సంఖ్యలో ఉద్యోగులు స్థానికత కోల్పోయారు.

అంతే కాకుండా ఉద్యోగుల సీనియారిటీ మరియు పదోన్నతుల్లో చాల సమస్యలు ఏర్పడే అవకాశం తలెత్తింది.

2. ఉద్యోగం చేసే భార్య భర్తలు వేరు వేరు ప్రాంతాలకు సర్దుబాటు చేయడం జరిగింది.

3.ప్రభుత్వం అనుమతించిన అనారోగ్య సమస్యలు తో బాధపడే వారిని సైతం పరిగణనలోకి తీసుకోలేదు.

4. స్థానికత కోల్పోయిన ప్రతీ ఉద్యోగిని అవసరం అయితే సూపర్ న్యూమరీ పోస్టులు క్రియేట్ చేసి అయినా వారి స్థానిక ప్రాంతాలకు సర్దుబాటు చేయాలి.

5. భార్య భర్త ఇద్దరు ఉద్యోగం చేసే పరిస్థితులలో ఇద్దరినీ కూడా ఒకే ప్రాంతానికి సర్దుబాటు చెయ్యాలి.

6. అలాగే తీవ్రమైన అనారోగ్య సమస్యలు తో బాధపడే వారిని సైతం పరిగణనలోకి తీసుకుని వారి సమస్యలు కూడా పరిష్కరించాలి.

కాబట్టి దీనిపై ప్రభుత్వం పూర్తి స్థాయిలో పునః పరిశీలించి పైన చెప్పినా అన్ని సమస్యల పరిష్కారం చేయాల్సింది కోరడం జరిగింది. ఒకవేళ ఖాళీలు లేకపోయినా సూపర్ న్యుమారీ పోస్టులు క్రియేట్ చేసి అందరి సమస్యలు పరిష్కరించాలని కోరడం జరిగింది.

జీఓ నం.317 సమస్య ఎదుర్కొంటున్న ఉద్యోగులందరికీ న్యాయం చేయాలని కోరారు. మరోసారి ఇలాంటి పరిస్థితులు ఉద్యోగులకు రాకుండా చూడాలన్నారు.

కార్యక్రమంలో ఉద్యోగుల జేఏసీ నాయకులు డా.నిర్మల, హన్మంతరావు, డా.కత్తి జనార్దన్, రమేష్ పాక, దర్శన్ గౌడ్, హరికృష్ణ, వివేక్, గరిక ఉపేందర్ రావు, జె.తిరుపతి, శ్రీధర్, సుగంధిని, హేమలత, రాబర్ట్ బ్రూస్, రోహిత్ నాయక్, మల్లెష్, తదితరులు పాల్గొన్నారు.

Spread the love