కాంగ్రెస్‌లో ఉంటే జగన్ సీఎం అయ్యేవారు: బ్రదర్ అనిల్.
ఏపీలో వైఎస్ జగన్, షర్మిల మద్య ఆస్తుల వివాదం కొనసాగుతోంది. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ దుమారం రేగింది.
షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమార్ ఓ యూట్యూబ్ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘వైఎస్సార్ చనిపోగానే కాంగ్రెస్ నుంచి జగన్ బయటకు వచ్చి పార్టీ పెట్టారు. మొదటి సారి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు ఆయన కాంగ్రెస్‌లో ఉంటే సీఎం అయ్యేవారు’ అని బ్రదర్ అనిల్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఈ గొడవలతో విసిగి విజయమ్మ విదేశాలకు వెళ్లిపోయారని, పాదయాత్ర సమయంలో షర్మిళ పార్టీని హస్తగతం చేసుకుంటుందని సజ్జల జగన్ కి చెప్పారని ఇలా అనేక ఆసక్తికరమైన విషయాలను బ్రదర్ అనిల్ చెప్పారు.
దేవుడి ఆజ్ఞతోనే షర్మిల రాజకీయాల్లోకి వచ్చారని కాంగ్రెస్ పార్టీలో చేరారని అని చెప్పుకొచ్చారు.