

*గుడి గుడికో ఓ జమ్మి చెట్టు*
*గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్వర్యంలో మాజీ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారి కార్యక్రమం లో భాగంగా ఈ రోజు వికారాబాద్ లోని మూసి జన్మ స్థలంలో గల బుగ్గ రామలింగేశ్వర స్వామి వారి దేవాలయ పరిదిలో వేద పండితుల ఆధ్వర్యంలో జమ్మి వృక్ష ప్రతిష్ట చేయడం జరిగింది.
పర్యావరణ పరిరక్షణతో పాటు, హిందూ సంస్కృతి సంప్రదాయాలలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న జమ్మి చెట్టును ప్రతి గుడి ఆవరణలో నాటాలని కోరారు. ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ గారు ఆ స్వామి వారి ఆశీస్సులతో ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చెయ్యాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమం లో మాజీ BC కమిషన్ సభ్యులు శుభ ప్రద్ పటేల్ గారు, చైతన్య, కేదార్ నాద్ తదితరులు పాల్గొన్నారు.