
కొండా మురళి పుట్టిన రోజు సందర్భంగా వినూత్న కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కొండా సురేఖ.
బాలికలతో కలిసి సైకిల్ తొక్కిన మంత్రి.
వరంగల్ బట్టలబజార్, ఆంధ్రబాలిక ప్రభుత్వోన్నత పాఠశాలకు చెందిన పలువురు విద్యార్థులకు కొండా మురళి జన్మదినోత్సవాన్ని (అక్టోబర్ 23) పురస్కరించుకుని మడిపెల్లి కృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన సైకిళ్ళను పంపిణీ కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ గారు పాల్గొన్నారు.
తన చేతుల మీదుగా వారికి సైకిళ్ళను పంపిణీ చేశారు. బాలికలతో కలిసి సైకిల్ తొక్కి వారిని ఉత్సాహపరిచారు. బాగా చదువుకొని రాణించాలని ప్రోత్సహించారు.