
కొరియా నుంచి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి..
ఒకటి రెండు రోజుల్లో పొలిటికల్ బాంబులు పేలనున్నాయి.
ప్రధాన నాయకులపైన చర్యలు తప్పవు.
ఆధారాలతో సిద్దమైన ఫైళ్లు.
జాతీయ తెలుగు ఛానెల్ ఇంటర్య్వూలో ..
రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి.
దీపావళికి ముందే రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాజకీయ సంచలనాలు సృష్టించే పొలిటికల్ బాంబ్‌లను పేల్చేశారు.
సియోల్‌లో హన్ నది పునరుజ్జీవన పరిస్ధితులను అధ్యయనం చేయడానికి వెళ్లిన మంత్రి పొంగులేటి అక్కడ ఓ తెలుగు జాతీయ ఛానల్ ప్రతినిధికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం ప్రాజెక్ట్, ధరణి వంటి సుమారు 8 నుంచి 10 ప్రధాన పాయింట్లలో ఈ చర్యలు ఉంటాయన్నారు. దీనికి సంబంధించి ఫైళ్లు పూర్తి సాక్ష్యాధారాలతో సిద్ధమయ్యాయని మంత్రి పొంగులేటి వివరించారు.
సియోల్ నుంచి మరో 2 రోజుల్లో హైదరాబాద్ చేరేసరికల్లా చర్యలు ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయన్నారు. కేవలం కక్ష సాధింపులా గాక పూర్తిగా ఆధారాలతో చర్యలు ఉంటాయని, ఎంతటివారినైనా ఉపేక్షించేదిలేదన్నారు. తొందరపడి ఎటువంటి ఆధారాలు లేకుండా వెళ్లబోమన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు సంబంధించి విచారణ దాదాపు పూర్తయిందని మొత్తానికి ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం ప్రాజెక్ట్, ధరణి వంటి అంశాలు ట్రాక్‌లో ఉన్నాయని మంత్రి పొంగులేటి చెప్పారు.
ప్రజలు ఇంతవరకు ఎటువంటి చర్యలు లేవని భావించవద్దని, వారు కోరుకునే విధంగా పూర్తి ఆధారాలతో ముఖ్యంగా ఫైళ్లు సాయంతో ముందుకు వెళ్లబోతున్నామని సంచలనాలకు మంత్రి తెరతీశారు.