Morning News 13-10-2024

• గుజరాత్ లోని జామ్ నగర్ రాజకుటుంబ సింహాసనానికి టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ అజయ్ జడేజాను తదుపరి వారసుడిగా ప్రకటించారు.

• ఉప్పల్ వేదికగా టీమిండియా బంగ్లాదేశ్ పై 183 పరుగుల రికార్డ్ విజయంతో సిరీస్ క్లీన్ స్వీప్.

• ఢిల్లీ వర్సిటీ మాజీ ప్రొఫెసర్ సాయిబాబా కన్నుమూత.

• 11,558 రైల్వే ఉద్యోగాల దరఖాస్తుకు చివరి తేదీని పొడిగించారు. గ్రాడ్యుయేట్ పోస్టులకు అక్టోబర్ 20 వరకు, అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకు అక్టోబర్ 27 వరకు చివరి తేదీని పొడిగించారు.

• రతన్ టాటా భారత్ గర్వించదగ్గ ముద్దుబిడ్డ అంటూ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు సంతాపం తెలిపారు.

• సల్మాన్-షారూఖ్ ల మధ్య కోల్డ్ వార్ ని అంతం చేసిన మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ ముంబయిలో హత్య.

• రేపు బంగాళాఖాతంలో అల్ప పీడనం. ఏపీకి భారీ వర్ష సూచన, హెచ్చరికలు జారీ.

• ఏపీలోని గ్రామీణ స్థానిక సంస్థల కోసం 15వ ఆర్థిక సంఘం రూ.988 కోట్లకు పైగా మొదటి విడతగా నిధుల విడుదల.

• బ్రహ్మోత్సవాల్లో భాగంగా తిరుమల శ్రీవారి ఆలయాన్ని 6 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు : టీటీడీ ఈవో శ్యామలరావు

• రోజూవారీ పనులను చేసేందుకు ఎలాన్ మస్క్ కంపెనీ టెస్లా రూపొందించిన హుయమనాయిడ్ రోబో ‘ఆప్టిమస్’ ప్రపంచాన్ని ఆకర్షిస్తోంది.

• ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుల విషయంలో కొత్త మార్పులు నవంబర్ 15 నుంచి అమల్లోకి రానున్నాయి.

• ఎడ్యుకేషన్ మాఫియాను చీల్చి చెండాడుతూ టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో రజనీకాంత్, అమితాబ్ లు నటించిన ‘వేట్టయాన్ ది హంటర్’ సినిమా వంద కోట్ల క్లబ్ లో చేరేందుకు పరుగులు తీస్తోంది.

Spread the love