*Morning News*

తెలంగాణలో సమగ్ర కులగణనపై జీవో జారీ.

ఏపీలో మద్యం షాపుల టెండర్లకు ముగిసిన గడువు.

ఈనెల 16న ఏపీ కేబినెట్ కీలక సమావేశం.

రాజరాజేశ్వరి అలంకారంలో విజయవాడ దుర్గమ్మ దర్శనం.

తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల పాటు మోస్తరు వానలు.

మోదీని ఓడించాలంటే కాంగ్రెస్‌ అందరితో కలవాలి – ఒవైసీ.

చెన్నైలో గూడ్స్‌ను ఢీకొన్న రైలు,రెండు బోగీలు దగ్ధం.

ప్రపంచ ఆకలి సూచీలో భారత్‌కు 111వ స్థానం.

రాత్రి 7 గంటలకు ఉప్పల్‌లో భారత్ – బంగ్లా మూడో టీ20.

*రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం*

దక్షిణ బంగాళాఖాతంలోని మధ్య భాగాలపై సగటు సముద్ర మట్టానికి 3.1 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉన్న ఉపరితల ఆవర్తనం.

ఆంధ్ర ప్రదేశ్, యానాం ల్లో దిగువ ట్రోపో ఆవరణంలో విస్తున్న ఆగ్నేయ దిశగా గాలులు.

*రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం.*

అల్పపీడనం 14వ తేదీ నాటికి వాయుగుండంగా,

15 వ తేదీ నాటికి తీవ్ర తుపానుగా మారనుందని భారత వాతావరణశాఖ అంచనా.

తీవ్ర తుపాన్ గా మారి 15వ తేదీన తమిళనాడులో తీరం దాటే అవకాశం.

రాష్ట్రవ్యాప్తంగా 14, 15, 16 తేదీల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం.

ఇవాళ రాష్ట్రంలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం.

Spread the love