మోడ్రన్ మహిమాన్వితులు

ఈ విశ్వం ఏర్పడి హీనపక్షంగా 13.8 లక్షల కోట్ల సంవత్సరాలు ఐంది! జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ప్రయోగం తరవాత బిగ్ బ్యాంగ్ ప్రశ్నార్థకంలో పడుతున్న తరుణంలో వెలువడ్డ మరో అధ్యయనం ప్రకారం ఈ సృష్టి వయసు పెరిగింది! అది 26.7 బిలియన్ ఇయర్సని శాస్త్రలోకం ఒక కొత్త అంచనాకు వచ్చింది! కాగా, ఈ సృష్టి సృజన జరిగి ఇప్పటికి 155.52 ట్రిలియన్ ఇయర్స్ ఐందినేది సనాతన హిందూ వాఙ్మయాల ఉవాచ!

సృష్టి లయలు నిరంతరం సాగే చక్రం వంటివని అవి ఉటంకిస్తున్నాయి! ఇప్పటికి 83 సృష్టులు ముగిసి 84 వ సృష్టి నడుస్తోందన్నది సిద్ధులు చెప్తున్న మాట! సూర్య, భూగోళాలు ఉనికిలోకి వచ్చి దాదాపుగా 4.5 బిలియన్ సంవత్సరాలు ఔతోందనేది శాస్త్రీయ పరిశీలన! భూగ్రహం మనుగడలోకి వచ్చిన దాదాపు 1 బిలియన్ సంవత్సరాల తరవాత జీవావరణ పరిస్థితులు నెలకొన్నాయి! 3.5 బిలియన్ ఏళ్ల క్రితం ఈ ధరిత్రి మీద తొలి జీవావిర్భావం జరిగింది

జీవం పుట్టుక, దాని పరిణామక్రమం ఒక ఆసక్తికరమైన కథ! అంతరిక్షంలోని చీకటిని చీల్చుకుంటూ సూర్యకాంతి భూమ్మీద ప్రసరించింది! అలా ప్రసరించిన కాంతి అవనిపై నీటిలో విద్యుత్తును రగిలించింది! ఎలక్ట్రిసిటీ కలిగిన ఆ నీరు మట్టిలో అనేక రసాయనిక మార్పులకు కారణమైంది! విద్యుత్ సహిత నీటిప్రవాహ ధాటికి ఆ మట్టి మురుగుగా మారింది! అది మళ్లా నీటితో చర్య పొందడం వల్ల మొదట అమైనో ఆమ్లం [#AminoAcid] ఆవిష్కృతమైంది! తద్వారా పాకురు [#AlgeaFossil] సృష్టి జరిగింది! తరవాత, ఆ ఆల్గే శిలాజం ఉత్పరివర్తనం [#Mutation] చెంది మొట్టమొదటి వృక్షజాతులు ఈ నేలపై వేళ్ళూనుకున్నాయి! అదే పచ్చటి పాకురు కుళ్లిపోవడం వల్ల విడుదలైన అమైనో యాసిడ్లు నీటిలో ఒకదానితో మరొకటి కూడటం వల్ల సయనో బ్యాక్టీరియా జనించింది! తరవాత అది మైటోకాండ్రియాగా రూపాంతరం చెంది, ఏకకణ [#Unicellular], బహుకణ [#Multicellular] జీవులు, అకశేరుకాలు [#Invertebrates], సకశేరుకాల [#Vertebrates] నుంచి క్షీరదాలు [#Mammales] గా జీవపరిణామం కొనసాగింది!

అలా కొన్ని లక్షల ఏళ్ల తరవాత రెండు పాదాల [#Bipedal] పై నడవగల, బొటనవేలు [#Thumb] తో పట్టు బిగించగల సంక్లిష్టమైన లక్షణాలను కలిగిన ఆదిమానవుడు [#PrimitiveMan] అవతారం ఎత్తాడు! అదిగో అలా పురుడుపోసుకున్న మనిషి, తొలినాళ్లలో వేటాడటమే ప్రధానవృత్తిగా చేసుకొని సంచారజీవిగా మనుగడ సాగించాడు! ప్రాచీనయుగంలో వేట కోసం రాతి [#Palaeolithic] పనిముట్లను తయారు చేసుకొన్న ఆదిమ మానవుడు, రెండు చెకుముకిరాళ్ల [#FlintStones] ను రాపాడించి అగ్గిని రాజేయడం నేర్చుకున్నాడు! పచ్చిమాంసం మానేసి కాల్చిన ఆహారం తినడం మొదలుపెట్టాడు! కొంతకాలానికి వ్యవసాయం ప్రారంభించి, నదీపరివాహక ప్రాంతాల్లో సంఘజీవిగా స్థిరనివాసం ఏర్పరుచుకొన్నాడు!

అదేసమయంలో, పాడికోసం ఆవును, రక్షణకోసం కుక్కలను మచ్చిక చేసుకొని, వాటితో సహజీవనం చేస్తూ నాగరికత వైపు అడుగులు వేశాడు! అలా ఇనుపయుగం [#IronAge], కంచుయుగం [#BronzeAge] లను దాటి మనిషి ఆధునికయుగం [#ModernAge] లో ప్రవేశించాడు! ఐతే, మానవనాగరికత విప్లవాత్మక రూపం తీసుకొని సాంకేతికత వైపు అడుగులేసింది మాత్రం చక్రం [#Wheel] కనుగొన్న తరువాతే!

స్థిరనివాసం ఏర్పరుచుకొని సంఘజీవనం ప్రారంభించిన తరవాత ఆనాటి మానవునికి కొంత ఖాళీ సమయం చిక్కింది! రాత్రివేళ నిద్రించే సమయంలో ఆకాశంలోకి సుదీర్ఘంగా చూసే అవకాశం ఏర్పడింది! దాంతో, తన చుట్టూ ఉన్న ప్రకృతి [#Nature] ని, ఆకాశంలోని చుక్కలను చూడటం [#StarGazing], వాటిని క్షుణ్ణంగా పరిశీలించడం మొదలుపెట్టాడు! పరిసరాలను అర్థం చేసుకొని సృష్టి రహస్యాలను కనుగొనే ప్రయత్నం చేశాడు! ఆధ్యాత్మికతను అలవర్చుకున్నాడు! వేల సంవత్సరాలు తపస్సు చేసి విశేషజ్ఞానాన్ని సంపాదించి ఋషి పుంగవుడయ్యాడు! ప్రాచీనకాలంలో ఋషే వైజ్ఞానికుని [#Scientist] పాత్ర పోషించాడని అనడంలో ఎలాంటి శశభిష అక్కరలేదు!

అలా తపస్శక్తితో మన చుట్టూ ఉన్న అనేక అంశాలపై పరిశోధనలు జరిపి, అపారమైన విజ్ఞానాన్ని సంపాదించి వాటికి అక్షర రూపం ఇచ్చాడు! తీక్షణమైన దూరదృష్టితో ఖగోళవీక్షణం చేశాడు! భూగోళంపై పరిశీలనలు జరిపాడు! అవే ఇప్పుడు వేదాల రూపంలో మనకు అందుబాటులో ఉన్నాయి! ఆక్రమంలోనిదే ఋగ్వేదం! ఇది ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన గ్రంథం! ప్రాచీన జిజ్ఞాసువులు ఆనాడే బహుళ ప్రపంచాలు [#Multiverse], అనేక లోకాల [#Dimensions] ప్రస్తావన చేశారు! సృష్టి, స్థితి, లయల గుట్టు విప్పారు! ఆనాటికి అనుగుణంగా పామరులకు అర్థం కావడానికి వాళ్లు వాడిన భాష, ఎంచుకున్న యాసలు మినహా ఆధునిక శాస్త్రజ్ఞులకు దీటుగా, ప్రస్తుతానికి ఏమాత్రం తీసిపోని విధంగా ప్రాచీన ఋషులు తమ పరిశోధనలను ఏనాడో జనసామాన్యానికి ఎరుకపరిచారు!

మోడ్రన్ సైన్స్ అభివృద్ధి చెంది గరిష్టంగా ఓ 500 ల సంవత్సరాలు ఐంది! భరతఖండం నుంచి వేదవిజ్ఞానం మధ్యప్రాచ్యం మీదుగా పాశ్చాత్య దేశాలకు చేరిన తరవాతే, అక్కడివాళ్ల పరిశీలనలు, పరిశోధనలు, అధ్యయనాలు ఊపందుకున్నాయని సనాతనవాదులు ఢంకా బజాయించి చెప్తుంటారు! ఈక్రమంలో #అన్నీవేదాల్లోనేఉన్నాయిష అంటూ ఎడమవాటంగాళ్లు ఎగతాళి చేసినా పట్టించుకోనవసరం లేదంటారు వాళ్లు! నిజాలు నిలకడ మీద వాటంతటవే బైటపడతాయనేది సో కాల్డ్ స్పిరిచువలిస్టుల వెర్షన్! ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానంతో జరగుతున్న పరిశోధనలు అనేక సంచలన కోణాలను ఆవిష్కరిస్తున్న విషయాన్ని వాళ్లు కోట్ చేస్తున్నారు! మన ప్రాచీన చరిత్రకు ఊతమిచ్చే ఆధారాలు అనేకం బైట పడుతున్నాయని గుర్తు చేస్తున్నారు!

ఇవాళ్టి ఈ ఆధునిక శాస్త్రసాంకేతికతల నేపథ్యం కేవలం 100 ఏళ్లు మాత్రమే! జస్ట్ ఈ షార్ట్ పీరియడ్ లోనే మోడ్రన్ మ్యాన్ కన్సిడరెబుల్ టెక్నలాజికల్ అడ్వాన్స్మెంటును సాధించాడు! హిందూ వాఙ్మయాలు ఏనాడో చెప్పిన పరలోకవాసుల ప్రస్తావనను మరోసారి తాజాగా తెరపైకి తెస్తున్నాడు! వ్యాస్ట్ యూనివర్స్ లో ఇతర చోట్ల కూడా ఇంటెలిజెంట్ లైఫ్ ఉందనే కోణంలో రీసెంట్ గా ఆలోచిస్తున్నాడు, అన్వేషిస్తున్నాడు! ఇండియన్ స్పేస్ రీసర్చ్ ఆర్గనైజేషన్ [#ISRO] చైర్మన్ డాక్టర్ సోమనాథ్ వ్యాఖ్యలు ఇక్కడ ప్రస్తావనార్హం! ఈ అనంత విశ్వంలో అనేక చోట్ల గ్రహాంతరవాసులు ఉన్నారన్నది ఆయన వ్యాఖ్య! లక్షల కోట్ల సంవత్సరాల విశ్వ వయసు స్థాయిని [#CosmicScale] లెక్కిస్తే, మనకంటే ముందే అవతరించి, ఓ వెయ్యేళ్ల అడ్వాన్స్మెంట్ ఉన్న ఏలియన్ సొసైటీల ఉనికిని కొట్టి పడేయలేం అంటారాయన!

అలాంటి నాగరిక గ్రహాంతర సమాజాల [#ExtraTerrestrialCivilizations] వాళ్లు ఇప్పటికే అనేకసార్లు మన భూగ్రహాన్ని సందర్శించి ఉంటారనేది ఆయన అనుమానం! వాళ్ల వైజ్ఞానికస్థాయి మనకన్నా ఉన్నతమై ఉంటుందనీ, అందుకే వాళ్లు మనకు కనిపించడం లేదేమో అన్నది ఆయన వెర్షన్! అంతెందుకు, వాళ్లు మన మధ్యలో అదృశ్యంగా తిరగాడుతూ మన చర్యలన్నిటినీ ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నా ఆశ్చర్యం లేదంటారాయన! అలాంటప్పుడు, వాళ్లు అతీతశక్తులు కలిగి ఉన్నట్లే కదా! సో, ఆ ఏలియన్స్ సైతం ముమ్మాటికీ మహిమాన్వితులే! వాళ్ల ముందు మనం జుజూబీ! మరి, ఆనాడు మన ఋషులు, సిద్ధులు చెప్పిందేమిటి? అంటే, ప్రాచీనకాలంలో వాళ్లు మాట్లాడిన శక్తులు, మహిమలు, మాయలు, మర్మాల గురించే ఇవాళ సైన్స్ పేరిట మరొక్కసారి మనం వల్లె వేస్తున్నాం అన్నమాట!

ఫైనల్ గా, సైంటిఫిక్ [#Scientific] గా ఉంటే తెలియని వాటిని ఆవిష్కరించవచ్చు, సైంటిస్టిక్ [#Scientistic] గా ఉంటే తెలియని వాటిని తిరస్కరించవచ్చు! ఎవరూ కాదనేది లేదు! కానీ, సాక్ష్యం లేకపోవడాన్ని, ఒకటి ఉనికిలో లేదని చెప్పడానికి సాక్ష్యంగా పరిగణించకూడదన్న ప్రాథమిక సూత్రాన్ని మరచి పోవద్దు! ప్రాచీన వైజ్ఞానికులుగా ప్రసిద్ధి పొందిన ఋషులు కనుగొని చెప్పినా, ఆధునిక శాస్త్రవేత్తలు శోధించి సాధించినా సైన్స్ సైన్సే! కేవలం ఋషులు చెప్పినంత మాత్రాన అవి పుక్కిటి పురాణాలు కావు! ఆధారాలు దొరకనంత మాత్రాన అవి అబద్ధాలు ఐపోవు!

ఆధునిక వైజ్ఞానిక లోకం రేపేదైనా కొత్త విషయం కనుగొనవచ్చు, ఇంకేదైనా వెలుగులోకి రావచ్చు! మనిషిని ఎంతటి శక్తివంతుడిగానైనా తయారు చేయవచ్చు, కానీ వాటి మూలాలు కొన్నైనా మన వాఙ్మయాల్లో ఉన్నాయన్నది పచ్చి నిజం! ఈ నేపథ్యంలో రాబోయే పది, ఇరవై, ముప్ఫై, వంద, వెయ్యి, పదివేల ఏళ్లలో నవయుగ వైతాళికుడిగా మనిషి తనకు అందుబాటులో ఉన్న ప్రకృతి శక్తులను వాడుకుని ఎంతటి మహిమాన్వితుడు కాగలడో తెలుసుకునే ప్రయత్నమే ఈ కొత్తాదేవుడండీ, కొంగొత్తా దేవుడండీ! #WaitForTheNext

Suraj V. Bharadwaj

Spread the love