
మీడియాతో సీఎం రేవంత్ ముచ్చట. సియోల్ సందర్శించిన జర్నలిస్టులతో ముఖా ముఖి.
కెసిఆర్ శకం ముగిసింది, ఇక ఆయన పేరు వినిపించదు.
కెసిఆర్ గడువు దాటిన (ఎక్స్ పెయిరీ) మెడిసిన్, కేటిఆర్ తోనే కెసిఆర్ రాజకీయం ముగుస్తుంది.
బావతో బామ్మర్ది రాజకీయం ముగుస్తుంది. ఆ తర్వాత బావను ఎలా హేండిల్ చేయాలో మాకు తెలుసు అని రేవంత్ రెడ్డి అన్నారు.
మూసీ పై…
మూసీ పునరుజ్జీవనం మొదటి ఫేజ్ బాఫూ ఘాట్ అభివృద్ధి. ప్రపంచంలోనే అతి పెద్ద గాంధీ విగ్రహం నెలకొల్పుతాం.
మల్లన్న సాగర్ నుంచి 7 వేల కోట్లతో నీటిని ఉస్మాన్ సాగర్ కి మళ్ళిస్తాం.
అక్కడి నుంచి హిమాయత్ సాగర్ బాపూఘాట్ వద్ద నీటిని శుద్ధి చేసి, Stpల ద్వారా నీటిని మూసీలోకి వదులుతాం.
పదకొండున్నర కిలోమీటర్స్ ఒక స్ట్రెచ్, ఏడున్నర కిలోమీటర్స్ మరో స్ట్రెచ్ బాపు ఘాట్ నుంచి ఉస్మాన్ సాగర్ వరకు తొలిదశలో అభివృద్ధి.
కేటీఆర్, హరీష్ రావు, ఈటెల మూసీ పై మీ విజన్ ఏమిటో నాకు కాకుంటే డిప్యూటీ సీఎం, లేదా చీఫ్ సెక్రెటరీకి ఇవ్వండి.
మీరు ఫార్మ్ హౌస్ లో ఉండవచ్చు మూసి ప్రజలు అక్కడే ఉండాలా, మూసీ నిర్వాసితులను తప్పకుండా ఆదుకుంటాం.
మూసి పునరుజ్జీవనం తోపాటు పరిసరాలలో మరొక నగరాన్ని అభివృద్ధి చేస్తాం. రాత్రి 7 నుంచి ఉదయం 7 వరకు మార్కెట్ ఉండేలా ప్లాన్.
మూసీ అభివృద్దిపై నేను ముందు కాన్సెప్ట్ డెవలప్ చేస్తున్న. ఆతర్వాత ప్రజలను ఒప్పిస్తా. వాడపల్లి నుంచి వికారాబాద్ వరకు పాదయాత్ర చేస్తా.
141 కోట్లతో డీ పీఆర్ తయారీకి ఇచ్చాము, 3 నెలల్లో నివేదిక వస్తుంది.
నిరసనలపై పోలీస్ లను పెట్టి నిర్బంధం చేయవచ్చు ఆది నా విధానం కాదు.
వాళ్లు వెళ్లి ప్రజల ఆలోచనలు తెలుసుకునే అవకాశం ఉంటది.
కేటీఆర్ కూకట్ పల్లి కి వెళ్లి చిన్న పాపకి బాగ్ ఇచ్చాడు ఇళ్ళు ఇస్తాడు అనుకున్నా.
దేశమంతా రిసెషన్ ఉంది, హైడ్రా తో రియల్ ఎస్టేట్ పడిపోలేదు.
కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్ లతో పాటు పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లపై విచారణలు కొనసాగుతున్నాయి, చట్టప్రకారం చర్యలు ఉంటాయి.
ఫోన్ టాపింగ్ నిందితుల పాస్ పోర్ట్ రద్దయింది అనధికారికంగా ఎంతో కాలం విదేశాల్లో ఉండలేరు.
స్పోర్ట్ సిటీ స్మార్ట్ సిటీ లను డెవలప్ చేస్తా 300 కోట్ల ఫండ్ తో స్కిల్ యూనివర్శిటీ నడుపుతాము.
ఎలాంటి ఫైనాన్సియల్ మోడల్ వాడాలో డీపీఆర్ లో తెలుస్తుంది.
నిర్వాసితులని ఖాళీ చేపిస్తే ఎంత మేర మూసి ప్రవాహం ఉంటుందో తెలుస్తుంది ఆ తర్వాత కన్సల్టెన్సీల కన్సార్టియం అగ్రిమెంట్ రూపొందిస్తాయి.
ఇప్పటి వరకు 49 వేల కోట్ల అప్పు తెచ్చాము.
56 వేల కోట్ల కెసిఆర్ చేసిన అప్పు తీరుస్తున్నాం.