*ప్రకృతి అందాల లక్నవరంలో మరో ఆకర్షణ*
*అందుబాటులోకి వచ్చిన మరో ఐలాండ్ టూరిజం*
*అద్భుతమైన సౌకర్యాలతో వసతి, పసందైన భోజనం, వాటర్ అండ్ అడ్వెంచర్ స్పోర్ట్స్*
చుట్టూ దట్టమైన అడవి, పచ్చటి కొండలు వాటి మధ్యలో పెద్ద జలాశయం అక్కడ ఓ ద్వీపంలో బస. ఇంత అందమైన ఊహ నిజమైతే ఎలా ఉంటుంది. అచ్చం మన లక్నవరంలా ఉంటుంది. అక్కడికి చేరుకోవటం కూడా చాలా సులువు.
హైదరాబాద్ కు కేవలం 220 కిలో మీటర్ల దూరం, నాలుగు గంటల్లో లక్నవరం చేరుకోవచ్చు. తెలంగాణలోని అన్ని ప్రాంతాల నుంచి మెరుగైన రవాణా సదుపాయం ఉంది.
కేరళ, లక్షద్వీప్, బాలీ లాంటి పర్యాటక ప్రాంతాలకు ఒక సారూప్యత ఉంది. అందమైన ప్రకృతికి తోడు చుట్టూ నీళ్లు, బోటు షికారు, ఐలాండ్ ల్లో వసతి వీటి ప్రత్యేకత. సరిగ్గా ఈ అన్ని సౌకర్యాలతో ములుగు జిల్లా లక్నవరంలో మూడో ద్వీప రిసార్ట్స్ మనకోసం సిద్ధమైంది.
తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఫ్రీకౌట్స్ సంస్థ లీజు పద్దతిలో రిసార్టును అభివృద్ది చేసి *ది కోవ్* పేరుతో రిసార్టు అందుబాటులోకి తెచ్చారు.
అన్ని సౌకర్యాలతో కూడిన 22 ప్రీమియం రూములు, కొన్ని గదులకు అటాచ్డ్ స్విమ్మింగ్ పూల్స్, అదనంగా కామన్ పూల్, జిప్ లైన్ లాంటి అడ్వంచర్ గేమ్స్, వాటర్ స్పోర్ట్స్, మినీ బీచ్, క్యాంపింగ్ ఇలా ఒక్కటేమిటి మనం అడుగుపెడితే చాలు అన్ని రకాల అనుభూతులను పంచేందుకు ది కొవ్ రిసార్ట్స్ సిద్దంగా ఉంది. అద్భుతమైన సూర్యోదయం, సూర్యాస్తమయాల వీక్షణం, సరదాగా చేపలవేట అదనపు ఆకర్షణలు.
పార్టీలు, ప్రీ వెడ్డింగ్ షూట్, డెస్టినేషన్ వెడ్డింగ్ లకు ఈ లక్నవరం రిసార్ట్స్ లేటెస్ట్ ఆకర్షణగా మారబోతోంది.
ప్రకృతి పర్యాటకానికి ప్రాధాన్యతను ఇస్తూ పర్యావరణహిత టూరిజం అభివృద్ది చేయాలన్న ప్రభుత్వ సంకల్పాన్ని నిజం చేస్తూ ఈ రిసార్ట్ ముస్తాబైంది.
మరింత సమాచారం, బుకింగ్ వివరాల కోసం
జనరల్ మేనేజర్ జాన్ 9700006049
మేనేజర్ జితేందర్ 9000912221 నెంబర్ లలో సంప్రదించవచ్చు.