*రూ 47.65 కోట్ల నికర లాభాన్ని సాధించిన ఒలెక్ట్రా*

*2024-25 ఆర్ధిక సంవత్సర రెండో త్రైమాసిక ఫలితాల వెల్లడి*

*90 శాతం పెరిగిన ఈ బి ఐ టి డి ఏ*

*పన్నుల చెల్లింపునకు ముందు 144 శాతం పెరిగిన లాభం*

*చెల్లింపుల తరువాత 156 శాతం పెరుగుదల*

ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ లిమిటెడ్ (OGL), ఈ ఏడాది సెప్టెంబర్ 30తో ముగిసిన రెండో త్రైమాసిక, అర్ధ-సంవత్సర ఏకీకృత ఆర్థిక ఫలితాలను సోమవారం ప్రకటించింది. వడ్డీ, పన్నులు, తరుగుదల, రుణ చెల్లింపులకు ముందు ఆదాయాలు ఈ ఆర్ధిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రూ. 523.67 కోట్లు అంటే 70 శాతం పెరిగింది. త్రైమాసికంలో అధిక డెలివరీల ఫలితంగా ఈ గణనీయమైన ఆదాయ వృద్ధి నమోదు చేసింది.

ఇదే సమయంలో కంపెనీ ఈ బి ఐ టి డి ఏ ఆకట్టుకునేవిధంగా రూ. 85.69 కోట్లకు చేరుకుంది, గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది 90 శాతం పెరుగుదలను సూచిస్తుంది. సోమవారం జరిగిన సమావేశంలో డైరెక్టర్ల బోర్డు ఈ ఫలితాలను ఆమోదించింది.ఈ త్రైమాసికంలో ఒలెక్ట్రా 315 ఎలక్ట్రిక్ వాహనాలను పంపిణీ చేసింది, గత ఏడాది ఇదే సమయంలో 154వాహనాలను డెలివరీ చేసింది. అంటే 105 శాతం పెరుగుదలను సాధించింది.

ఓలెక్ట్రా లాభం పన్నుల చెల్లింపులకు ముందు గత ఆర్థిక సంవత్సరం రూ. 26.57 కోట్లతో పోలిస్తే 144 శాతం పెరుగుదలతో రూ.64.83 కోట్లకు పెరిగింది. పన్నుల చెల్లింపుల తరువాత లాభం రూ. 47.65 కోట్లుగా ఓలెక్ట్రా నమోదు చేసింది. గత ఆర్థిక సంవత్సరంలో రూ. 18.58 కోట్లతో పోలిస్తే, ఇది 156 శాతం పెరిగింది.

ఒలెక్ట్రా అర్ధ సంవత్సరం పనితీరు ముఖ్యాంశాలు :

కంపెనీఈ ఆర్ధిక సంవత్సరం తోలి ఆరునెలల్లో ఆదాయం రూ. 837.61 కోట్లు, ఇది 60 శాతం పెరిగింది. ఈ ఆరునెలల్లో కంపెనీ ఈ బి ఐ టి డి ఏ ఆకట్టుకునే విధంగా రూ. 136.20 కోట్లకు చేరుకుంది, ఇది మునుపటి సంవత్సరంతో పోలిస్తే గణనీయమైన 57 శాతం పెరుగుదలను సూచిస్తుంది. పన్నుల చెల్లింపునకు ముందు లాభం రూ. 96.68 కోట్లకు పెరిగింది, గత ఆర్థిక సంవత్సరం రూ. 51.83 కోట్లతో పోలిస్తే ఇది 87 శాతం పెరుగుదల నమోదు చేసింది. పన్నుల చెల్లింపుల తరవాత లాభం గత ఆర్థిక సంవత్సరం రూ. 36.65 కోట్లతో పోలిస్తే 96 శాతం పెరిగి రూ.71.91 కోట్లుగా ఉంది.

ఈ ఫలితాలపై వ్యాఖ్యానిస్తూ ఒలెక్ట్రా సి ఎం డీ కె వీ ప్రదీప్ మాట్లాడుతూ, “ఈ ఆర్ధిక సంవత్సరం రెండో త్రైమాసికం, తోలి ఆరు నెలలల్లో మా ఏకీకృత ఆదాయం , లాభములో వృద్ధిని సాధించటం పట్ల సంతోషిస్తున్నాము. మా ఉత్పత్తిని పెంచడం , మా సాంకేతిక సామర్థ్యాలను మెరుగుపరచడంపై మా దృష్టి కొనసాగుతుంది. మా ఆర్డర్ బుక్ బలంగా ఉంది” అని అన్నారు.

Spread the love